దేశంలో వరుస దాడులకు పీఎఫ్ఐ ప్లాన్: యూపీలో ఇద్దరు అరెస్ట్

By narsimha lodeFirst Published Feb 17, 2021, 11:06 AM IST
Highlights

దేశంలో వరుస దాడులకు ప్లాన్ చేసిన పాపులర్ ఫ్రంట్ ఇండియా (పీఎఫ్ఐ) కి చెంందిన ఇద్దరు సభ్యులను ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్  పోలీసులు అరెస్ట్ చేశారు.


లక్నో: దేశంలో వరుస దాడులకు ప్లాన్ చేసిన పాపులర్ ఫ్రంట్ ఇండియా (పీఎఫ్ఐ) కి చెంందిన ఇద్దరు సభ్యులను ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్  పోలీసులు అరెస్ట్ చేశారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు నిందితులు ప్లాన్ చేశారని పోలీసులు చెప్పారు. నిందితులు కేరళ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఈ దాడుల నిర్వహించేందుకు సభ్యులను నియమించుకొన్నారని 
యూపీ లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్  ప్రశాంత్ కుమార్ చెప్పారు.

యూపీలోని గుదంబ ఏరియాలోని  కుక్రైల్ ట్రైసెక్షన్ ప్రాంతం నుండి అన్సద్ బద్రుద్దీన్, ఫిరోజ్ ఖాన్ లను అరెస్ట్ చేశారు. బ్యాటరీ, రెడ్ వైర్, ఒక 32 బోర్ ఫిస్టల్, ఏడు లైవ్ కార్జిడ్లు, నగదు, పాన్ కార్డు, నాలుగు ఏటీఎం కార్డులు, పెన్‌డ్రైవ్ లు, మెట్రో కార్డు, డ్రైవింగ్ లైసెన్సులు, ఆధార్ కార్డులతో పాటు పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

దేశ సమగ్రత, సామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఎఫ్ఐ సభ్యులు కుట్ర చేశారని ఎస్టీఎఫ్ పోలీసులు అనుమానిస్తున్నారు.

దేశంలో వరుస ఉగ్రదాడుల గురించి ఆయుధాలు, పేలుడు పదార్ధాలను సేకరిస్తున్నారు. యూపీలోని సున్నితమైన  ప్రదేశాల్లో , ఓ వర్గం సంస్థలు, కార్యాలయాలపై దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని సభ్యులను ఈ గ్రూప్ చేర్చుకొంటుందని  ఏడీజీపీ ప్రశాంత్ కుమార్ చెప్పారు.
 

click me!