జిమ్ లు ఓపెన్.. వాళ్లకి మాత్రం నో ఎంట్రీ

By telugu news teamFirst Published Aug 4, 2020, 11:42 AM IST
Highlights

ఆక్సిజన్ సాచురేషన్ శాతం తక్కువ ఉన్నవారు వెంటనే సమీపంలోని వైద్యకేంద్రాలకు వెళ్లాలని సర్కారు సూచించింది. జిమ్  లు, యోగా కేంద్రాలను తెరిచేందుకు అనుమతించిన సర్కారు ప్రతి ఒక్కరూ 6 అడుగుల సామాజిక దూరం పాటించడంతోపాటు ఫేస్ గార్డులు, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని కోరింది.

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో.. కొంతకాలం పాటు.. దేశంలో లాక్ డౌన్ విధించారు. అయితే.. నెమ్మదిగా  లాక్ డౌన్ ని దశలవారీగా ఎత్తివేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల జిమ్స్ ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే.. కొద్దిమందికి మాత్రం జిమ్ లోకి రావడానికి అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు.

ఆక్సిజన్ సాచురేషన్ శాతం 95 కంటే తక్కువ ఉన్న వారికి జిమ్ లలోకి ప్రవేశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత తరుణంలో ఆక్సిజన్ సాచురేషన్ శాతం 95 కంటే తక్కువ ఉన్న వారిని జిమ్, యోగా స్టూడియోల్లోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ సాచురేషన్ శాతం తక్కువ ఉన్నవారు వెంటనే సమీపంలోని వైద్యకేంద్రాలకు వెళ్లాలని సర్కారు సూచించింది.

జిమ్  లు, యోగా కేంద్రాలను తెరిచేందుకు అనుమతించిన సర్కారు ప్రతి ఒక్కరూ 6 అడుగుల సామాజిక దూరం పాటించడంతోపాటు ఫేస్ గార్డులు, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని కోరింది. యోగా, జిమ్ చేసేటపుడు 15 నుంచి 30 నిమిషాలపాటు వ్యవధి ఇవ్వాలని, 65 ఏళ్ల వారు, అనారోగ్య సమస్యలున్న వారు రావద్దని సర్కారు సూచించింది. 

click me!