ఇక సామాన్యులకూ కోవిడ్ వ్యాక్సిన్.. మార్చి 1 నుంచి అమలు

By Siva KodatiFirst Published Feb 24, 2021, 3:51 PM IST
Highlights

మార్చి 1వ తేదీ నుంచి సామాన్యులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.. 60 ఏళ్లు పైబడిన వాళ్లతో పాటు.. వివిధ వ్యాధులతో బాధపడుతోన్న 45 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

మార్చి 1వ తేదీ నుంచి సామాన్యులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.. 60 ఏళ్లు పైబడిన వాళ్లతో పాటు.. వివిధ వ్యాధులతో బాధపడుతోన్న 45 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

జనవరి 16వ తేదీన ప్రారంభమైన వ్యాక్సినేషన్.. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా ఇచ్చారు.. ముందుగా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు.. ఇలా వ్యాక్సినేషన్ జరుగుతోంది.

నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1.17 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక, తాజా నిర్ణయంతో మార్చి 1వ తేదీ నుంచి సామాన్యులకు కూడా వ్యాక్సినేషన్ జరగబోతోంది. 

click me!