పెగాసెస్: కేంద్రానికి సుప్రీం నోటీసులు

By narsimha lodeFirst Published Aug 17, 2021, 2:21 PM IST
Highlights


పెగాసెస్ పై కేంద్రానికి సుప్రీం నోటీసులు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది.  ఈ విషయమై 10 రోజుల్లో కేంద్రం అభిప్రాయం చెప్పాలని ఆ నోటీసులో కోరింది.

న్యూఢిల్లీ: ;పెగాసెస్ అంశంపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టు మంగళవారం నాడు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్కకాంత్, అనిరుద్ద బోస్ లతో కూడిన ధర్మాసనం  కేంద్రానికి నోటీసులు పంపింది. ఈ విషయమై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరింది.

ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య అయినందున పెగాసెస్ లేదా మరే ఇతర సాఫ్ట్‌వేర్ నిఘా కోసం ఉపయోగించారో  కేంద్రం వెల్లడించలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు.ఈ విషయాన్ని పబ్లిక్ డొమైన్ లో ఉంచలేమన్నారు.

స్వతంత్ర నిపుణుల కమిటీకి వివరాలను వెల్లడంచేందుకు కేంద్రం సిద్దంగా ఉందని మెహతా చెప్పారు. దేశ భద్రతతో రాజీపడడానికి తాము కూడ ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను బహిర్గతం చేయడానికి మనలో ఎవరూ కూడ ఇష్టపడరని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింి.

తమ ఫోన్లపై నిఘా పెట్టారని ఆరోపిస్తున్న వారిలో ప్రముఖులు సహా పౌరులున్నారన్నారు. అయితే ఈ విషయమై ఆ అధికారులు అఫిడవిట్ దాఖలు చేస్తే తప్పేం ఉందని కోర్టు ప్రశ్నించింది.ఈ విషయమై తాము ఓ కమిటీని ఏర్పాటు చేయాలనుకొంటున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.

click me!