ముద్దు చేస్తూనే, వివస్త్రను చేశారు.. వాళ్ల ముఖాలు ఇప్పటికీ గుర్తే : కలెక్టర్ దివ్య సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 29, 2023, 06:46 PM IST
ముద్దు చేస్తూనే, వివస్త్రను చేశారు.. వాళ్ల ముఖాలు ఇప్పటికీ గుర్తే  : కలెక్టర్ దివ్య సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కేరళలోని పథనంతిట్ట కలెక్టర్ దివ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల చిరుప్రాయంలోనే తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె చెప్పారు. నాటి ఘటనతో ఎన్నో ఏళ్లు మానసిక క్షోభ అనుభవించానని కలెక్టర్ తెలిపారు. 

కేరళలోని పథనంతిట్ట కలెక్టర్ దివ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. ఆరేళ్ల వయసులో ఇద్దరు వ్యక్తులు తనను అప్యాయంగా దగ్గరికి తీసుకున్నారని .. ఆ తర్వాత తనను వివస్త్రను చేశారని కలెక్టర్ దివ్య తెలిపారు. దీంతో భయపడి తాను అక్కడి నుంచి పారిపోయానని ఆమె వెల్లడించారు. దీంతో చిరుప్రాయంలోనే తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని.. కానీ తల్లిదండ్రుల సహకారంతో ఆ బాధ నుంచి బయటపడినట్లు దివ్య పేర్కొన్నారు. 

కేరళకు చెందిన యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో జరిగిన అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్య పై విధంగా వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాలను వివరించాలని కలెక్టర్ తెలిపారు. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారికి మంచేదో, చెడేదో చెప్పాలని దివ్య సూచించారు. నాటి ఘటన తర్వాత తనపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తులను మళ్లీ చూడలేదని.. కానీ వారి ముఖాలు నేటికీ గుర్తున్నాయని కలెక్టర్ అన్నారు. పిల్లలకు ఎదురయ్యే ఈ తరహా సమస్యలపై తల్లిదండ్రులు,టీచర్లు చెప్పాలని కలెక్టర్ దివ్య స్పష్టం చేశారు. 

ALso REad: షాకింగ్.. నా తండ్రే లైంగికంగా వేధించాడు, మా అమ్మకి చెబితే.. ఖుష్భూ సంచలన వ్యాఖ్యలు

కాగా.. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ నటి, బీజేపీ నేత ఖుష్భూ మహిళల గురించి మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన సంచలన సంఘటనని రివీల్ చేశారు.  తనకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రే తనని లైంగికంగా, శారీరకంగా వేధించేవాడు అంటూ ఖుష్భూ ప్రకంపనలు రేపే కామెంట్స్ చేసింది. అమ్మాయికి అయినా, అబ్బాయికి అయినా చిన్న తనంలోనే వేధింపులు ఎదురైతే జీవితం భయకంరంగా అనిపిస్తుంది. మా అమ్మ గురించి చెప్పాలంటే వివాహం చేసుకుని ఎంతో చిత్రవధ అనుభవించింది. ఒక మగాడు తన భార్యని కొట్టడం, పిల్లలని కొట్టడం , చివరకి కూతురుని కూడా అసభ్యంగా తిట్టడం వేధించడం తన జన్మ హక్కుగా భావించే రోజులు అవి.

నాకు 8 ఏళ్ల నుంచే మా నాన్న వల్ల వేధింపులు ఎదురయ్యాయి. ఆయన్ని ఎదిరించడానికి కావలసిన ధైర్యం నాకు 15 ఏళ్లకు వచ్చింది. ఈ విషయం మా అమ్మకి చెప్పినావు నమ్మేది కాదు. ఎందుకంటే ఆమె పతియే దైవం అని భావించే ఎన్విరాన్మెంట్ లో పెరిగిందని ఖుష్బు అన్నారు. ఏం జరిగినా, ఆయన ఏం చేసినా నా భర్త దేవుడు అనే భావనలో ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తనకు 15 ఏళ్లు వచ్చిన నాటి నుంచి మా నాన్నపై తిరిగబడడం ప్రారంభించానని ఖుష్భూ చెప్పారు. కానీ నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న మరణించారని.. అప్పుడు పూట గడవడం కూడా కష్టంగా ఉండేది అంటూ ఖుష్భూ తన బాల్యంలో జరిగిన సంచలన సంఘటనని తెలిపింది. ఇదిలా ఉండగా ఖుష్బూ తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్ సిని వివాహం చేసుకుంది. 2000లో వీరి వివాహం జరగగా.. ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!
Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu