ఎయిర్ పోర్టులో కలకలం.. ప్రయాణికుడి వద్ద 20 బులెట్స్

Published : Dec 25, 2020, 10:40 AM ISTUpdated : Dec 25, 2020, 10:44 AM IST
ఎయిర్ పోర్టులో కలకలం.. ప్రయాణికుడి వద్ద 20 బులెట్స్

సారాంశం

ఔరంగాబాద్ నగరం నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు వచ్చారు. ప్రయాణికుడి వద్ద 7.65 ఎంఎం కాలిబ్రీ తుపాకీలో వాడే 20 లైవ్ బుల్లెట్లను సీఐఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

దేశరాజధాని ఢిల్లీలో ని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు.  ఓ ప్రయాణికుడి నుంచి 20 రౌండ్ల బుల్లెట్లను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు స్వాధీనం చేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా వెతకగా. అతని వద్ద బులెట్స్ దొరకడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఔరంగాబాద్ నగరం నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు వచ్చారు. ప్రయాణికుడి వద్ద 7.65 ఎంఎం కాలిబ్రీ తుపాకీలో వాడే 20 లైవ్ బుల్లెట్లను సీఐఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ తనిఖీల్లో భాగంగా సీఐఎస్ఎఫ్ బలగాలకు ఈ బుల్లెట్లు దొరికాయి. ఔరంగాబాద్ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగులో బుల్లెట్లు లభ్యం కావడంతో వాటిని స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. బుల్లెట్లను అక్రమంగా తీసుకురావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్