Parliament Winter sessions : లోక్ సభలో ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం..

By AN TeluguFirst Published Nov 29, 2021, 11:31 AM IST
Highlights

కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అకాల వర్షాలతో తడిచి, మొలకలు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.  కొందరు రైతులు మానసిక ఒత్తిడితో గుండె ఆగి, ఆత్మహత్యలకు ఒడిగట్టి ప్రాణాలు వదులుతున్నారన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదని.. ఈ సమస్యపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఉందని వాయిదా తీర్మానం ఇచ్చారు రేవంత్ రెడ్డి.

ధాన్యం కొనుగోళ్ల పై లోక్ సభ లో కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం సేకరణ చేయడం లేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు లక్షల టన్నుల ధాన్యంతో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అకాల వర్షాలతో తడిచి, మొలకలు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.  కొందరు రైతులు మానసిక ఒత్తిడితో గుండె ఆగి, ఆత్మహత్యలకు ఒడిగట్టి ప్రాణాలు వదులుతున్నారన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదని.. ఈ సమస్యపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఉందని వాయిదా తీర్మానం ఇచ్చారు రేవంత్ రెడ్డి.

ఇదిలా ఉండగా.. నేటి నుంచి Parliament winter session 2021లు ప్రారంభం అయ్యాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే అధికార, విపక్షాలు తమ అస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే.. repealing of three farm laws బిల్లును సభ ముందుకు తీసుకురావాలని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తుంది. అలాగే కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లో తీసుకురానుంది. 

Parliament winter session: ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రధాని నరేంద్ర మోదీ

అయితే రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దతపై,  సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని విపక్షాలు గట్టిగా కేంద్రాన్ని కోరనున్నాయి. సాగు చట్టాలను కేంద్రం మరో రూపంలో తీసుకు వస్తుందని అనుమానిస్తున్న విపక్షాలు.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ వివరంగా సమాధానం చెప్పాలిన డిమాండ్ చేయనున్నాయి. 

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో విపక్ష సభ్యులు adjournment motion ఇచ్చారు. సాగు చట్టాలు, రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. వ్యవసాయ చట్టాల నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారంకు సంబంధించింది వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. 

'మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని ప్రారంభించాలని, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలో గత ఏడాది కాలంలో మరణించిన 700 మంది రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలనే డిమాండ్‌పై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. 

- రాజ్యసభలో కనీస మద్దతు ధరను చట్టబద్దత చేయాలని సీపీఐ నోటీసులు ఇచ్చింది. 

-ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని ఉభ‌య‌స‌భ‌ల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. . తెలంగాణలో వరి ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం,  ధాన్యం సేకరణలో కేంద్రం వివక్షపై చర్చించాలని టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. రూల్ 267 కింద త‌క్ష‌ణ‌మే ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై లోక్‌స‌భ‌లో నామా నాగేశ్వ‌రరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ధాన్యం సేకరణలో కేంద్రం వివక్షపై చర్చ చేపట్టాలని కోరారు. 

click me!