Parliament Session 2022: ఆ రోజు నుంచే పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు.. వాడీవేడీ చ‌ర్చ‌లకు విప‌క్షాలు సిద్దం

By Rajesh KFirst Published Jul 1, 2022, 1:36 AM IST
Highlights

Parliament Monsoon  Session 2022: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుండి ప్రారంభం కానున్నాయి. జూలై 18 నుంచి ఆగ‌స్టు 12వ‌ర‌కు వ‌ర్ష‌కాల‌ స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ వెల్లడించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాష్ట్రపతి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.
 

Parliament Monsoon  Session 2022: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుండి ప్రారంభం కానున్నాయి. జూలై 18 నుంచి ఆగ‌స్టు 12వ‌ర‌కు వ‌ర్ష‌కాల‌ స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ వెల్లడించింది. లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటన ప్రకారం.. 17వ లోక్‌సభ తొమ్మిదో సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగే అవకాశం ఉందని త‌న ప్ర‌క‌ట‌న‌లో  పేర్కొంది. అదే సమయంలో రాజ్యసభ 257వ సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభమవుతాయని రాజ్యసభ సెక్రటేరియట్ బులెటిన్ పేర్కొంది. 

జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరగనున్నందున ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు (Parliament Monsoon Session) ప్రత్యేకం కానున్నాయి. ఇప్ప‌టికే .. ఎన్డీఏ ప‌క్ష అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము బ‌రిలో ఉండ‌గా.. విప‌క్ష పార్టీల‌ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా బ‌రిలో నిలిచారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు జూలై 21న జ‌రుగుతుంది. నూత‌న రాష్ట్ర‌ప‌తి జూలై 15న పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ప్ర‌మాణం చేస్తారు. ఇదే త‌రుణంలో ఆగ‌స్టు 6న.. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది. నూత‌న‌ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఆగ‌స్టు 11న ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

జూలై 18 నుంచి ఆగస్టు 12 మధ్య వర్షాకాల సెషన్‌ (Parliament Monsoon Session)లో మొత్తం 17 పనిదినాలు వస్తాయి. ఈ సెషన్‌లో కేంద్ర‌ ప్రభుత్వం అనేక బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే..  పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపిన 4 బిల్లులు ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు (Parliament Monsoon Session) కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంలో జ‌రుగుతాయ‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు.

ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) వాడీవేడీగా జ‌రుగ‌నున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  రాహుల్, సోనియాల‌ను ప్ర‌శ్నించ‌డం. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం వంటి ఇతర  సమస్యలను ప్రశ్నిస్తూ  కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షలు సిద్ధంగా ఉన్నాయి. విపక్షాల ఆరోపణలకు సమాధానం ఇస్తామని  మంత్రులు ధీమాగా ఉన్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి.

click me!