బాలీవుడ్ గీత రచయితకు బంగారు గొలుసును ఇచ్చిన ఓ పాకిస్థానీ ఫ్యాన్.. ఎందుకింత అభిమానం?  

By Asianet News  |  First Published Aug 30, 2023, 2:00 PM IST

ఆ తరువాత దేవ్ కోహ్లి తన సీటు నుండి లేచి.. తనను గుర్తించిన పాకిస్థానీ( పఠాన్)తో ఆప్యాయంగా కరచాలనం చేశాడు. దాని తర్వాత ఇద్దరూ కొన్ని నిమిషాల పాటు ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత అభిమానిని (పఠాన్‌ను) తనతో పాటు లంచ్‌లో కూర్చోబెట్టాడు దేవ్ కోహ్లీ. ఇదోక భావోద్వేగ సన్నివేశం.  


ఈ ఘటన దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం జరిగింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని ధాబాలో ఒక సిక్కు పెద్దమనిషి తాను ఆర్డర్ చేసిన ఆహారం కోసం ఎదురు చూస్తున్నాడు. అతను ఎర్రటి తలపాగా, తెల్లటి పట్కా ధరించాడు.అతని ముఖంలో ఏదో తెలియని తేజస్సు. అతనితో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

అకస్మాత్తుగా ఓ అపరిచితుడు అతని వద్దకు వెళ్లి.. తాను పాకిస్తాన్ నుండి వచ్చిన సందర్శకుడని పరిచయం చేసుకున్నాడు. ఆ వెంటనే ఎలాంటి సందేహం లేకుండా.."మీరు దేవ్ కోహ్లీ కాదా.. నాకు తెలుసా?" అనేశాడు.  ఆ సిక్కు పెద్దమనిషి కూడా .."అవును, నా పేరు దేవ్ కోహ్లీ, మీరు..?" అని ప్రశ్నించారు. ఆ పక్కన ఉన్నవారు కూడా షాక్.. ఆ సిక్కు పెద్దమనిషి సినీ పాటల రచయిత దేవ్ కోహ్లీ నా అని.. (ఆ పాకిస్థాన్ అభిమాని, రచయితల సంభాషణ క్రమంగా సాగుతూనే ఉంది.) 

Latest Videos

undefined

ఆ వెంటనే ఆ అభిమాని సమాధానమిస్తూ...  తాను బాలీవుడ్ గీత రచయితకు పెద్ద అభిమానినని, ఆయన పాటలను ఎంతో ఇష్టంగా వింటానని చెప్పాడు. పాకిస్థాన్‌లోని ఉర్దూ మ్యాగజైన్‌లో ప్రచురితమైన అనేక వార్తకథనాలు, ఫోటోల కారణంగా తాను సులభంగా గుర్తించానని చెప్పాడు. పాకిస్తాన్‌లోని చాలా మంది స్థానిక గాయకులు కూడా.. మీ(దేవ్ కోహ్లీ) పాటలు పాడుతారని ఆ అభిమాని చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత దేవ్ కోహ్లి తన సీటు నుండి లేచి.. తనను గుర్తించిన పాకిస్థానీ( పఠాన్)తో ఆప్యాయంగా కరచాలనం చేశాడు. దాని తర్వాత ఇద్దరూ కొన్ని నిమిషాల పాటు ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత అభిమానిని (పఠాన్‌ను) తనతో పాటు లంచ్‌లో కూర్చోబెట్టాడు దేవ్ కోహ్లీ. ఇదోక భావోద్వేగ సన్నివేశం.  

సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం మైనే ప్యార్ కియా, 'ఆజ్ షామ్ హోనే ఆయీ', 'కబూతర్ జా-జా' వంటి చిత్రాలకు పాటలు రాసిన దేవ్ కోహ్లీ, షారుక్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం 'బాజీగర్' కోసం అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు రాసిన ఆ రచయిత(దేవ్ కోహ్లీ) శనివారం(ఆగస్టు 26) తుది శ్వాస విడిచారు. 81 ఏళ్ల ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

పఠాన్‌కు కోహ్లీ గురించి చాలా తెలుసు. అతని పరిజ్ఞానాన్ని ధృవీకరించడానికి అతనిని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. వీరి సంభాషణలో కోహ్లి రావల్పిండిలో పుట్టాడని తేలింది. వారిద్దరూ కలిసి భోజనం చేయడంతో వారి సంభాషణ మరింత సాగింది. ఈ సమయంలో  రచయిత(దేవ్ కోహ్లీ) తన తాజా కవితను ఓ కాగితం ముక్క మీద రాసి తన పాకిస్తానీ అభిమానికి బహుమతిగా ఇచ్చాడు. రచయిత కోహ్లి చూపించిన ప్రేమకు ఆ అభిమాని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ సమయంలో ఆ అభిమాని తన అభిమానాన్ని ఎలా చాటుకోవాలో తెలియక  కలత చెందాడు. ఆ వెంటనే తన మెడలోని బంగారు గొలుసు తీసి దేవ్ కోహ్లీ మెడలో వేశాడు ఆ అభిమాని. తాజాగా దేవ్ కోహ్లి మ్రతదేహనికి నివాళులర్పించేందుకు అమృత్‌సర్‌ని వచ్చాడు ఆనాటి అభిమాని.  

గేయ రచయిత దేవ్ కోహ్లి నవంబరు 2, 1942న రావల్పిండి (పాకిస్తానీ పంజాబ్)లో జన్మించారు. 1969లో విడుదలైన 'గుండ' సినిమాతో  తన కెరీర్‌ని ప్రారంభించాడు. దేవ్ కోహ్లి హిందీ చిత్రాలలో 100కి పైగా ప్రముఖ పాటలు రాశారు. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. అతని సమకాలీనులు అతన్ని ఇంద్రజాలికుడు-గీత రచయిత, శృంగార రాజు అని పిలిచారు. అతని ప్రతిభకు ఉత్తమ సాహిత్యానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా వరించింది.

ఆయన లక్ష్మీకాంత్-ప్యారేలాల్, అను మాలిక్, ఉత్తమ్ సింగ్, ఆనంద్-మిలింద్, రామ్-లక్ష్మణ్, ఆనంద్ రాజ్ ఆనంద్‌లతో సహా అనేక మంది ప్రముఖ స్వరకర్తలతో కలిసి పనిచేశారు. 'మైనే ప్యార్ కియా'తో పాటు 'బాజీగర్','ముసాఫిర్','షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా','జుద్వా -2' చిత్రాలకు పాటలు రాశారు. అంతేకాకుండా ఆయన అనేక పంజాబీ పాటలను కూడా వ్రాసాడు. కవిగా కూడా మంచి గుర్తింపు పొందాడు.

అతడు చివరిగా కంగనా రనౌత్ నటించిన 'రజ్జో'సినిమాల కోసం తన కలానికి పని చెప్పాడు. అతను 1969లో 'గుండా' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన 1971లో విడుదలైన 'లాల్ పత్తర్' చిత్రంలోని 'గీత్ గాతా హూన్ మైన్...' అనే పాట అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.

రచయిత: అమ్రీక్
 

click me!