భారీ విధ్వంసానికి కుట్ర: గుజరాత్ తీరంలోకి పాక్ స్పెషల్ కమాండోలు..?

By narsimha lodeFirst Published Aug 29, 2019, 2:43 PM IST
Highlights

గుజరాత్ తీరంలోకి పాక్ కమాండోలు చొరబడే ముప్పు ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించడంతో తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ ఆఫ్ కచ్, సర్ క్రీక్ ప్రాంతం మీదుగా పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) కమాండోలు లేదా ఉగ్రవాదులు చిన్న చిన్న పడవల ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుజరాత్ తీర ప్రాంత సిబ్బందికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.

భారత్‌లో ఏదో రకంగా అలజడి రేపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ దీనిలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ల గుండా తీవ్రవాదులను మనదేశంలోని పంపిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో గుజరాత్ తీరంలోకి పాక్ కమాండోలు చొరబడే ముప్పు ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించడంతో తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

గల్ఫ్ ఆఫ్ కచ్, సర్ క్రీక్ ప్రాంతం మీదుగా పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) కమాండోలు లేదా ఉగ్రవాదులు చిన్న చిన్న పడవల ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుజరాత్ తీర ప్రాంత సిబ్బందికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.

గుజరాత్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులు జరిపి విధ్వంసం సృష్టించాలని వీరు కుట్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే భారత నౌకాదళానికి చెందిన నౌకలపై దాడులు జరిపిందేందుకు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.

దీంతో బీఎస్ఎఫ్, కోస్ట్‌గార్డ్ అప్రమత్తమయ్యారు. గుజరాత్‌లోని అన్ని నౌకాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. కండ్లా పోర్టులో భద్రతను పెంచారు. అరేబియా తీరం వెంబడి అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. మరోవైపు గోవా తీరంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. 

click me!