జమ్ముకశ్మీర్: అందుబాటులోకి సెల్ ఫోన్ సేవలు

By Nagaraju penumalaFirst Published Aug 29, 2019, 12:37 PM IST
Highlights

పార్లమెంట్ లో జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు నేపథ్యంలో ఆగష్టు 5న జమ్ముకశ్మీర్ లో సెల్ ఫోన్ సేవలను రద్దు చేసింది ప్రభుత్వం. పార్లమెంట్ లో జమ్ముకశ్మీర్ విభజనపై జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జమ్ముకశ్మీర్ లో ఇంటర్నెట్, మరియు సెల్ ఫోన్ సేవలను నిలిపివేశారు జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్

జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు నెమ్మదిగా సర్థుకుంటున్నాయి. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఎలాంటి విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోకపోవడంతో జమ్ముకశ్మీర్ లో సెల్ ఫోన్ సేవలను పున: ప్రారంభించింది ప్రభుత్వం.  

జమ్ముకశ్మీర్ లోని 5 జిల్లాల్లో సెల్ ఫోన్ సేవలను పునరుద్దరించారు.  బుధవారం సాయంత్రం ఈ సర్వీసులను పునరుద్ధరించారు. దొడా, క్షిత్వార్, రాంబన్, రాజోరి, పూంఛ్ లోని ఐదు జిల్లాలలో సెల్ ఫోన్ సేవలను పునరుద్ధరించారు. 

పార్లమెంట్ లో జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు నేపథ్యంలో ఆగష్టు 5న జమ్ముకశ్మీర్ లో సెల్ ఫోన్ సేవలను రద్దు చేసింది ప్రభుత్వం. పార్లమెంట్ లో జమ్ముకశ్మీర్ విభజనపై జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జమ్ముకశ్మీర్ లో ఇంటర్నెట్, మరియు సెల్ ఫోన్ సేవలను నిలిపివేశారు జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఇకపోతే ఇటీవలే జమ్ముకశ్మీర్ లో పాఠశాలలను సైతం పున:ప్రారంభించిన సంగతి తెలిసిందే.  
 

click me!