
Bulldozer Row: ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఆక్రమణల కూల్చివేత, మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ఘటనలపై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం. బుల్‌డోజర్‌లతో భవనాలను కూల్చివేయడం శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. బుల్డోజర్లతో కూల్చివేతను సమర్ధించడం చట్టాన్ని కాలరాయడమేనని అన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి ఈ ఘటనలు నిదర్శనమని చిదంబరం పేర్కొన్నారు.
కాంగ్రెస్ తనపై మోపబడిన సాఫ్ట్ హిందుత్వ ఆరోపణలకు ప్రతిస్పందనగా 'లౌకికవాదాన్ని' మరింత దూకుడుగా ప్రవేశపెట్టాలా అని, లౌకికవాదం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమని, ఇది కాంగ్రెస్ యొక్క ప్రధాన విలువ అని అన్నారు. బుల్డోజర్ల ద్వారా భవనాలను కూల్చివేశారని, ఈ చర్యను సమర్థిస్తూ బీజేపీ నేతలు ఆడుకుంటోంది.
ఆలస్యానికి క్షమించండి
జహంగీర్‌పురి కూల్చివేతల ప్రదేశాన్ని విపక్షనేతలైన బ్రిందా కారత్ (సీపీఎం), అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)ల ప్రతినిధి బృందం సందర్శించిన ఒక రోజు తర్వాతే కాంగ్రెస్ ప్రతినిధి బృందం అక్కడకు వెళ్లిందన్న విమర్శలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ఎవరు ఎప్పుడెప్పుడు వెళ్లారనేది తనకు తెలియదని, భవనాలు కూల్చివేసిన కొద్దిసేపటికే కాంగ్రెస్ ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లిందని అన్నారు. ఏదైనా ఆలస్యం జరిగితే.. దానికి క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.
''నా ఆందోళన అంతా చట్టబద్ధ విధానాలకు తీవ్రంగా ఉల్లంఘించినప్పుడు.. మతాన్ని ఈ సమస్యలోకి ఎందుకు తీసుకువస్తున్నారు. రాజ్యాంగ నిర్మాణానికి సెక్యులరిజం పునాది. సెక్యూలరిజం విలువలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేవలం సెక్యులర్‌గా ఉంటే సరిపోదు. ప్రతి ఒక్కరూ సెక్యులరిజం భాష మాట్లాడాలని, సెక్యులరిజానికి భంగం కలిగిస్తే నిరసన తెలపాలన్నారు. సెక్యులరిజం విషయంలో ఎలాంటి సంకోచాన్ని తాను అంగీకరించలేనని అన్నారు.
సరైన మార్గం నుండి తప్పుకోవడం వల్ల ఏమీ సాధించలేమని అన్నారు. ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన బుల్డోడర్ రాజకీయాలపై చిదంబరం మాట్లాడుతూ.. వీటిని సమర్ధిస్తూ బీజేపీ నేతల వ్యాఖ్యలు చట్టాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయన్నారు. ఈ చర్య "లా అండ్ ఆర్డర్ పూర్తిగా పతనమైందని" చూపించిందని, ఆక్రమణలను తొలగించే.. ఈ "ప్రత్యేక" పద్ధతి ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని పేదలను లక్ష్యంగా చేసుకున్నట్లు భావించడం న్యాయమని అన్నారు. సరళమార్గం నుంచి తప్పుకోవడం వల్ల ఎవరూ ఏమీ పొందరని కూడా ఆయన అన్నారు.