మహారాష్ట్ర: చెట్టు కొమ్మ... 14 మంది ప్రాణాలను తీసేది, తప్పిన పెను ప్రమాదం

By Siva KodatiFirst Published Apr 28, 2021, 3:12 PM IST
Highlights

పర్బని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 14 మంది పేషెంట్లకు సిబ్బంది సకాలంలో ఆక్సిజన్ సపోర్ట్ అందించి వారి ప్రాణాలు నిలబెట్టారు.  స్టోరేజ్ ట్యాంక్ నుంచి గ్యాస్ అందిస్తున్న పైప్‌లైన్‌పై మంగళవారం రాత్రి ఒక చెట్టు కొమ్మ విరిగిపడటంతో గ్యాస్‌ లీక్ అయింది. 

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చికిత్సకు అత్యవసరమైన ఆక్సిజన్  నిల్వలు దేశంలో నిండుకున్నాయి. దీంతో ప్రాణవాయువు అందక పలువురు మరణిస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్రలలో పరిస్ధితులు దారుణంగా వున్నాయి,. దీంతో తమకు ఆక్సిజన్ నిల్వలు పంపాలని ఈ  రెండు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో తృటిలో పెను విషాదం తప్పింది. 

పర్బని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 14 మంది పేషెంట్లకు సిబ్బంది సకాలంలో ఆక్సిజన్ సపోర్ట్ అందించి వారి ప్రాణాలు నిలబెట్టారు.  స్టోరేజ్ ట్యాంక్ నుంచి గ్యాస్ అందిస్తున్న పైప్‌లైన్‌పై మంగళవారం రాత్రి ఒక చెట్టు కొమ్మ విరిగిపడటంతో గ్యాస్‌ లీక్ అయింది.

Also Read:ఇండియాలో ఏడో రోజూ అదే జోరు: 24 గంటల్లో మూడున్నర లక్షలు దాటిన కేసులు

వెంటనే ఈ విషయాన్ని గ్రహించిన సిబ్బంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అప్రమత్తమయ్యారు. పేషెంట్లను జుంబో ఆక్సిజన్‌కు షిఫ్ట్ చేయడం ద్వారా ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం లేకుండా చూశారు. ఆ తర్వాత లీకేజీ రిపేర్ కోసం ఆక్సిజన్ సరఫరాను స్విచ్చాఫ్ చేసినట్టు డిప్యూటీ కలెక్టర్ వెల్లడించారు. 

ఆక్సిజన్ లీకేజ్‌ కారణంగా 2-3 నిమిషాల పాటు ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం కలిగిందని ఆయన చెప్పారు. టెక్నీషియన్లు రెండు గంటల్లో పైప్‌లైన్‌కు మరమ్మతు చేసినట్టు వివరించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, తెల్లవారుజామున 4 గంటలకు ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ జరిగిందని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు.

కాగా, ఈ నెల 21వ తేదీన నాసిక్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్‌లో లీకేజ్ తలెత్తి ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో 22 మంది కరోనా రోగులు మరణించిన సంగతి తెలిసిందే.

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!