Punjab Assembly Election 2022: పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపిక.. ఆప్ పిలుపునకు 24 గంటల్లో 8 లక్షల మంది స్పందన

By Rajesh KFirst Published Jan 15, 2022, 1:14 PM IST
Highlights

Punjab Assembly Election 2022:  పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ  (AAP) నుంచి సీఎం అభ్యర్థిలో మీకు నచ్చిన వారికి ఓటు వేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వస్తోంది. మొదటి 24 గంటల్లోనే 8 లక్షల మందికి పైగా స్పందించారు. పార్టీ పేర్కొన్న అభ్యర్థుల్లో తమ ఓటు ఎవరికో తెలిపారు.
 

Punjab Assembly Election 2022: త్వరలో జరగబోయే పంజాబ్ ఎన్నికలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ప్ర‌ధాన రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఓ పార్టీ కులాల పరంగా  ఎత్తులు వేస్తోంటే. మ‌రో పార్టీ ప్రాంతాల పరంగా ఓటర్లను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తోన్నారు. ఈ క్రమంలో 
ఆమ్ ఆద్మీ పార్టీ  (AAP) స‌రికొత్త‌ ఎత్తుగ‌తతో ముందుకు వెళ్తుంది. 
 
ఫిబ్రవరి 14న జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. త‌మ  పార్టీ నుంచి పోటీ చేసే సీఎం అభ్య‌ర్థిని మీరే సూచించాలని ప్రజలను కోరారు. ఈ మేర‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓ వినూత్న స‌ర్వేను చేసింది. ఈ నెల 17 తేదీ సాయంత్రం 5 గంటల్లోపు 70748 70748 ఫోన్​ నంబరుకు ఫోన్​ లేదా మెసేజ్​ చేసి ప్రజలు తమ సూచనలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ యాప్​ను లాంచ్ చేసినట్లు తెలిపారు.

ఆప్ నిర్వ‌హించిన‌ ‘జంతా చునేగీ అప్నా సీఎం’  అనే సర్వేకు విశేష ఆద‌ర‌ణ వ‌చ్చింది. ఆప్ విడుదల చేసిన ఫోన్ నంబర్‌కు కేవలం 24 గంటల వ్య‌వ‌ధిలోనే ఎనిమిది లక్షల మందికి పైగా ప్రజలు స్పందించారని ఆప్ సీనియర్ నాయకుడు హర్పాల్ సింగ్ చీమా శుక్రవారం తెలిపారు. 
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిలో మీకు నచ్చిన వారికి ఓటు వేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వస్తోంది. మొదటి 24 గంటల్లోనే 8 లక్షల మందికి పైగా స్పందించారు. పార్టీ పేర్కొన్న అభ్యర్థుల్లో తమ ఓటు ఎవరికో తెలిపారు.
 
ఈ స‌ర్వేకు మొదటి 24 గంటల్లోనే 8 లక్షల మందికి పైగా స్పందించార‌ని, వాట్సాప్ సందేశాల ద్వారా 3 లక్షల మందికి పైగా అభిప్రాయాలు తెలిపార‌నీ, అలాగే నాలుగు లక్షలకు పైగా ఫోన్ కాల్స్,  50 వేల‌కు పైగా  మెస్సే జ్ లు పంపించారని. అలాగే.. ఒక లక్షకు పైగా వాయిస్ మెస్సేజీల రూపంలో స్పందించార‌ని తెలిపారు. 
 
అందరి అభిప్రాయాలు తెలుసుకున్న త‌రువాత  సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చీమా పేర్కొన్నారు. సీఎం అభ్యర్థుల జాబితా నుంచి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన పేరును మినహాయించు కున్నారు.  జనవరి 17 సాయంత్రం 5 గంటల వరకు తమ అభిప్రాయాలను పంజాబ్ ప్రజలు తెలియజేసేందుకు ఆప్ అవకాశం కల్పించింది. 

ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకే కల్పించడం ఇదే మొదటిసారి. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని ప్రజలను గురువారం అడిగారు. ఆ పదవికి తన అభిప్రాయాన్ని తెలుపుతూ..  భగవంత్ మాన్ ని సీఎం అభ్య‌ర్ధిగా ఎన్నిక‌ల్లో నిల‌బెట్టాలని భావిస్తోన్న‌ట్టు తెలిపారు. అయినా త‌న వ్యక్తిగత అభిప్రాయం కంటే ప్రజల ఎంపికే ముఖ్యమ‌ని అన్నారు.

ముస ధోర‌ణికి స్వ‌స్తి ప‌లికి .. నూత‌న సాంప్ర‌దాయ‌నికి శ్రీ‌కారం చూట్టాల‌ని పిలుపునిచ్చారు. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు ఓ పార్టీ.. ప్రజాభ్రిపాయాన్ని కోరడం 1947 తర్వాత ఇదే తొలిసారి.  ఈ విధంగా ఆప్ కు ప్ర‌జల్లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలుసుకోవ‌చ్చ‌ని ఈ స‌ర్వే చేపట్టిన‌ట్టు రాజ‌కీయ విశ్లేషకులు భావిస్తోన్నారు. అదే స‌మయంలో పార్టీలోని లొసుగులు భ‌య‌ప‌డుతాయ‌ని భావిస్తోన్నారు.

click me!