అమ్మాయిలతో కలిసి 'క‌బ‌డ్డీ' .. కూతపెట్టిన బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌, వీడియో వైరల్

By Siva KodatiFirst Published Oct 14, 2021, 2:36 PM IST
Highlights

వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో తరచుగా వార్తల్లో నిలిచే బీజేపీ (BJP) ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌ (pragya singh thakur) కబడ్డీ ఆడారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ (madhya pradesh) రాజ‌ధాని భోపాల్‌లోని (bhopal) కాళీమాత‌ దేవాలయం వ‌ద్ద ఆమె ఆట ఆడారు. 

వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో తరచుగా వార్తల్లో నిలిచే బీజేపీ (BJP) ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌ (pragya singh thakur) కబడ్డీ ఆడారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ (madhya pradesh) రాజ‌ధాని భోపాల్‌లోని (bhopal) కాళీమాత‌ దేవాలయం వ‌ద్ద ఆమె ఆట ఆడారు. ద‌స‌రా (dussehra 2021) సంద‌ర్భంగా తొలుత గుడిలో పూజలు నిర్వహించిన ప్ర‌జ్ఞా ఠాకూర్‌ అనంత‌రం గుడి వ‌ద్ద మహిళలకు కబడ్డీ (kabaddi) పోటీలు నిర్వ‌హిస్తుండడాన్ని చూశారు. అయితే ప్ర‌జ్ఞాను కూడా ఆడాల‌ని అమ్మాయిలూ కోరారు. దీంతో వారి కోరికను కాదనలేకపోయిన ఆమె క‌బ‌డ్డీ.. క‌బ‌డ్డీ అంటూ కూత పెడుతూ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

కాగా, మాలెగావ్ కేసులో (malegaon) ఆమె ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌పై బయటకు వచ్చిన విష‌యం తెలిసిందే. ఆమె క‌బ‌డ్డీ ఆడిన వీడియోను పోస్ట్ చేసిన కాంగ్రెస్ (congress) నేత బీవీ శ్రీ‌నివాస్ (bv srinivas) ఆమెను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (nia) ముందు ఆమె విచార‌ణ‌కు మ‌ళ్లీ ఎప్పుడు హాజ‌రు కావాల్సి ఉందని ప్ర‌శ్నించారు.

AlsoRead:ఆరోగ్యం బాలేదు, కోర్టుకు రాలేనని సాకులు.. పెళ్లిలో డ్యాన్సులు: ప్రజ్ఞా ఠాకూర్‌పై కాంగ్రెస్ సెటైర్లు

మొన్నామధ్య ప్రజ్ఞా ఠాకూర్ ఉత్సాహంగా బాస్కెట్‌బాల్ ఆడుతూ ఉన్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఓ పెళ్లికి హాజరైన ఎంపీ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియోలపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందిస్తూ.. అనారోగ్య కారణాలతో హాజరుకాలేనని కోర్టుకు చెబుతున్న ఎంపీ.. ఇలా డ్యాన్స్‌లు చేయడం, బాస్కెట్‌బాల్ ఆడటం ఏంటంటూ సెటైర్లు వేశారు. ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఎప్పుడూ వీల్‌ఛైర్‌లోనే కన్పించే ఆమె.. ఒక్కసారిగా బాస్కెట్‌బాల్ ఆడటం, డ్యాన్సులు చేయడంతో ప్రతిపక్షనేతలు  విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భోపాల్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ప్రజ్ఞా ఠాకూర్.. పాదం కదుపుతూ అక్కడున్న వారిని డ్యాన్స్ చేయాలంటూ ఉత్సాహపరిచారు.

అనంతరం ప్రజ్ఞా ఠాకూర్ వచ్చి, ఆశీర్వదించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పెళ్లికుమార్తెలు మీడియాతో చెప్పారు. రోజు కూలీ అయిన ఓ వధువు తండ్రి మాట్లాడుతూ.. ఎంపీ సహాయం చేసుండకపోతే కుమార్తెలకు పెళ్లిళ్లు జరిగేవి కావన్నారు. అనంతరం మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ఈ వీడియోలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి కామెంట్ చేశారు.

సోదరి ప్రగ్యా ఠాకూర్‌ బాస్కెట్‌ బాల్‌ ఆడటం చూసినపుడు.. ఎవరి సాయం లేకుండానే నడిచినపుడు... ఇదిగో ఇలా డాన్స్‌ చేసినపుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి.. మాలేగావ్‌ కేసు విచారణలో కోర్టు ముందు హాజరు కాకుండా ఉండేందుకు అనారోగ్యంగా ఉన్నట్లు నటించి, బెయిలు మీద బయటకు వస్తారంతే. కానీ, ఇలాంటి వేడుకల్లో తను ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏదేమైనా ఆమెను ఇలా చూస్తుంటే, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోంది’’ అని సలూజ విమర్శలు గుప్పించారు

click me!