
మణిపూర్ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రధానంగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన జాతీయంగా, అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించిందని విపక్షాల మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మణిపూర్ విపక్ష ‘‘ఇండియా’’ కూటమి నేతలు సిద్ధమయ్యారు. జూలై 29న ఉదయం 20 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం విమానంలో మణిపూర్ బయల్దేరి వెళ్లనుంది. రెండు రోజుల పాటు ఎంపీల బృందం అక్కడ పర్యటించనుంది. పర్యటనలో భాగంగా జూలై 30న మణిపూర్ గవర్నర్‌ను విపక్ష ఎంపీల బృందం కలవనున్నారు. ఈ మేరకు మణిపూర్ వెళ్లే ఎంపీల వివరాలను ఇండియా కూటమి ప్రకటించింది.