ఉమెన్ చాందీ పార్థీవ దేహనికి నివాళులు: కుటుంబ సభ్యులకు సోనియా, రాహుల్ ఓదార్పు

Published : Jul 18, 2023, 11:28 AM ISTUpdated : Jul 18, 2023, 11:30 AM IST
ఉమెన్ చాందీ పార్థీవ దేహనికి నివాళులు: కుటుంబ సభ్యులకు సోనియా, రాహుల్ ఓదార్పు

సారాంశం

అనారోగ్యంతో మృతి చెందిన  కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ పార్థీవ దేహానికి కాంగ్రెస్ అగ్రనేతలు నివాళులర్పించారు.

బెంగుళూరు: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ  పార్థీవ దేహనికి   ఎఐసీసీ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే,  ఆ పార్టీ అగ్రనేతలు  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు  నివాళులర్పించారు. మంగళవారంనాడు తెల్లవారుజామున  ఉమెన్ చాందీ  బెంగుళూరులో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉమెన్ చాందీ చికిత్స పొందిన ఆసుపత్రి వద్ద  ఆయన పార్థీవదేహన్ని  కాంగ్రెస్ అగ్రనేతలు సందర్శించారు.  ఆయన బౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఉమెన్ చాందీ  బెంగుళూరులోని   హెచ్‌సీజీ  క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం  ఆయన కన్నుమూశారు.

బెంగుళూరులో  విపక్ష పార్టీల సమావేశం  రెండు రోజుల పాటు సాగుతుంది. నిన్న  సాయంత్రం ఈ సమావేశం ప్రారంభమైంది. ఇవాళ కూడ  ఈ సమావేశం  జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు విపక్ష పార్టీలకు  చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.  ఉమెన్ చాందీ  మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు  బెంగుళూరులో ఆయన నివాసానికి వెళ్లి  కుటుంబ సభ్యులను  ఓదార్చారు.  కాంగ్రెస్ పార్టీకి ఉమెన్ చాందీ చేసిన సేవలను  ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?