యూపీ ఎన్నికలు: అసదుద్దీన్‌పై కాల్పులు.. దుండగుడిని వెంటాడి పట్టుకున్న ఒవైసీ అనుచరులు

Siva Kodati |  
Published : Feb 03, 2022, 07:18 PM IST
యూపీ ఎన్నికలు: అసదుద్దీన్‌పై కాల్పులు.. దుండగుడిని వెంటాడి పట్టుకున్న ఒవైసీ అనుచరులు

సారాంశం

ఎంఐఎం (mim) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) కాన్వాయ్‌పై ఉత్తరప్రదేశ్‌లో (uttar pradesh) కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగుల్లో ఒకరిని అసద్ అనుచరులు వెంటాడి పట్టుకున్నారు. 

ఎంఐఎం (mim) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) కాన్వాయ్‌పై ఉత్తరప్రదేశ్‌లో (uttar pradesh) కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగుల్లో ఒకరిని అసద్ అనుచరులు వెంటాడి పట్టుకున్నారు. అతనిని నోయిడాకు (noida) చెందిన సచిన్‌గా గుర్తించారు. అలాగే నిందితుడి వద్ద నుంచి 9ఎంఎం పిస్తోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కాగా.. యూపీ ఎన్నికల ప్రచారంలో ( up polls) భాగంగా మీరట్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తుండగా అసదుద్దీన్ కాన్వాయ్‌పై కాల్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి. చార్జర్ సీ టోల్ ప్లాజా వద్ద దుండగులు ఓవైసీ కాన్వాయ్ మీద కాల్పులు జరిపారు.ఓవైసీ క్షేమంగా బయటపడ్డారు.కాల్పుల ఘటనను ఓవైసీ ధ్రువీకరించారు. తన కారు డ్యామేజ్ అయిందని, తాను మరో కారులో వెళ్లిపోయానని చెప్పారు.

తాను ప్ర‌యాణిస్తున్న కారుపై కాల్పులు జ‌రిగిన ఘ‌ట‌న గురించి మీడియాతో మాట్లాడిన అస‌దుద్దీన్ ఓవైసీ.. తన వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మూడు నుంచి నాలుగు రౌండ్ల  కాల్పులు జ‌రిపార‌ని తెలిపారు. కాల్పుల కార‌ణంగా కారు టైర్లు పంక్చర్ అయ్యాయని చెప్పారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డి నుంచి మ‌రో వాహ‌నంలో వాహనంలో  ఢిల్లీకి త‌న‌ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చిందని తెలిపారు. 

“నేను మీరట్‌లోని కితౌర్‌లో ఎన్నికల కార్యక్రమం తర్వాత ఢిల్లీకి బయలుదేరుతున్నాను. ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు వ్యక్తులు నా వాహనంపై 3-4 రౌండ్ల బుల్లెట్లు కాల్చారు. కాల్పులు జ‌రిపిన దుండ‌గులు ముగ్గురున‌లుగురు ఉన్నారు. కాల్పుల కార‌ణంగా  నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంపై బయలుదేరాను”అని అతను చెప్పాడు. కాగా, అస‌దుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రినీ అదుపులోకి తీసుకోలేదు. పోలీసుల నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. 
 

PREV
click me!

Recommended Stories

Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా