కరోనా వైరస్ ఇంకా పోలేదు. చాలా ప్రాంతాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ వైరస్ మునుపలిటాగే ప్రమాదకరమన్నారు.
న్యూఢిల్లీ:కరోనా వైరస్ ఇంకా పోలేదు. చాలా ప్రాంతాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ వైరస్ మునుపలిటాగే ప్రమాదకరమన్నారు. కరోనాను నిరోధించేందుకు తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటున్నామని ఆయన తెలిపారు.ప్రజలంతా మాస్కులను ధరించాలని ఆయన కోరారు.
also read:ఉత్తరకొరియాలో కరోనా తొలికేసు నమోదు: కేసాంగ్‌లో లాక్‌డౌన్ విధింపు
undefined
మన్‌కీ బాత్ కార్యక్రమంలో బాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు ప్రజలతో మాట్లాడారు. కరోనా నివారణకు ఉపయోగించే మాస్కులు తీయాలని భావించిన సమయంలో ఈ వైరస్ నిరోధం కోసం పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్ గురించి ఓ సారి ఆలోచించాలని ప్రధాని మోడీ ప్రజలను కోరారు. కరోనాను నిరోధించేందుకు గాను గ్రామాలు అసాధరణ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో కరోనా నుండి కోలుకొంటున్న రోగుల సంఖ్య గణనీయంగా మెరుగు పడిందని మోడీ చెప్పారు. అయితే ఈ వైరస్ కారణంగా చనిపోవడం తనకు ఇబ్బందిగానే ఉందన్నారు.
www.gallantryaward.gov.in సైట్ ను సందర్శించి దేశం కోసం ప్రాణాలర్పించిన ధైర్యవంతుల గురించి చదవాలని మోడీ ప్రజలను కోరారు. కార్గిల్ పోరాటంలో దేశానికి విజయాన్ని ఇచ్చిన సమయంలో నాటి ప్రధాని వాజ్ పేయ్ ఎర్రకోట నుండి ఇచ్చిన సందేశం ఇంకా ప్రతిధ్వనిస్తోందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.. ఏదైనా చర్య తీసుకొనే ముందు కార్గిల్ లో సైనికులు చేసిన త్యాగంలో మన త్యాగం విలువైందేనా అని ప్రశ్నించుకొందామని ఆయన ప్రజలను కోరారు.
సోషల్ మీడియాలో సైనికులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దన్నారు. ఈ రకమైన పోస్టులు సైనికులను మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్గిల్ లో పాకిస్తాన్ పై మనం విజయం సాధించిన రోజైనందున ఇవాళ చాలా ప్రత్యేకమైందన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ కూడ మర్చిపోలేరన్నారు. అయితే పాకిస్తాన్ తో తాము మంచి సంబంధాలను కోరుకొంటున్నామని కానీ అది జరగలేదన్నారు.
టెన్త్ పరీక్షల్లో పాసైన విద్యార్థులను మోడీ అభినందించారు. పలు రాష్ట్రాల్లోని విద్యార్థులతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. భవిష్యత్తులో వారంతా మరిన్ని విజయాలు సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.