ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్: సీజేఐ ఎన్వీ రమణ

Published : Feb 23, 2022, 04:06 PM ISTUpdated : Feb 23, 2022, 05:05 PM IST
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్: సీజేఐ ఎన్వీ రమణ

సారాంశం

ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ్ వ్యాఖ్యానించారు. తాను 25 రోజులుగా ఒమిక్రాన్ తో బాధపడుతున్నానని ఆయన చెప్పారు. 

న్యూఢిల్లీ:Omicron సైలెంట్ కిల్లర్ అని సుSupreme Courtచీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. తాను 25 రోజులుగా ఒమిక్రాన్ తో బాధపడుతున్నానని CJI  తెలిపారు. భౌతిక విచారణను ప్రారంభించాలని వచ్చిన వినతిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.  కరోనా మొదటి వేవ్ లో తాను నాలుగు రోజులే బాధపడ్డానని ఆయన చెప్పారు. కానీ థర్డ్ వేవ్ లో మాత్రం 25 రోజులుగా బాధపడుతున్నానని ఆయన వివరించారు. 

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ బౌతిక విచారణ నిర్వహించాలని చేసిన వినతిపై సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 15 వేలకు పైగా కేసులు నమోదౌతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఈ ఏడాది జనవరి మాసంలో సుప్రీంకోర్టుకు చెందిన 10 మంది న్యాయమూర్తులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అంతేకాదు సుప్రీంకోర్టు సిబ్బందిలో 30 శాతం కరోనా సోకింది. దీంతో ఆన్ లైన్ లో కేసుల విచారణను నిర్వహించారు. 

భారత్ లో కరోనా కొత్త కేసులు భారీగా క్షీణించాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం ఫిబ్రవరి 21 నాటికి  24 గంటల్లో దేశంలో కొత్తగా 16,051 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో  దేశంలో క‌రోనా బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 4,28,38,524 కు పెరిగింది. ఇదే సమయంలో 37,901 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 4,21,24,284 కి పెరిగింది. ప్రస్తుతం 2,02,131 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంటల్లో క‌రోనా మహమ్మారితో పోరాడుతూ 206 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివర‌కు దేశంలో మొత్తం 5,12,109 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.3 శాతంగా ఉండగా, మ‌ర‌ణాల రేటు 1.20 శాతంగా ఉంది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.1 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,ఉత్తరప్రదేశ్‌,వెస్ట్ బెంగాల్,ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ లు టాప్ లో ఉన్నాయి. 

ఇదిలావుండగా కరోనా ప్రభావం నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 175.5 కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. అందులో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 90.7 కోట్లు ఉండగా, రెండు డోసులు అందుకున్న వారి సంఖ్య 75.3 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 182 మందికి మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  ఈ నెల 21న ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 23,16,467కి చేరుకుంది. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,714కి చేరుకుంది. 

 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu