బీహార్‌లో రెండో విడత పోలింగ్: బోటులో పోలింగ్ స్టేషన్‌కి అధికారులు

By narsimha lodeFirst Published Nov 3, 2020, 1:07 PM IST
Highlights

బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్  ప్రాంతంలోని రిమోట్ ప్రాంతంలో గల పోలింగ్ స్టేషన్ కు వెళ్లేందుకు అధికారులు  బోట్ ను ఉపయోగించారు.
 

పాట్నా: బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్  ప్రాంతంలోని రిమోట్ ప్రాంతంలో గల పోలింగ్ స్టేషన్ కు వెళ్లేందుకు అధికారులు  బోట్ ను ఉపయోగించారు.

సమస్తీపూర్ ప్రాంతంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి.సమస్తిపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ లో వీవీప్యాట్ లేదా పేపర్ ట్రయల్ ఓటింగ్ యంత్రంలో లోపం ఏర్పడింది. ఈ గ్రామం పాట్నాకు 85 కి.మీ దూరంలో ఉంది.

ఈ విషయం తెలిసిన ఎన్నికల కమిషన్ కు చెందిన టెక్నికల్ టీమ్, పోలీసులు బోటు ద్వారా ఆ గ్రామానికి వెళ్లి వీవీప్యాట్ ను మార్చారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఇవి మూడో వంతు.2.85 కోట్ల మంది ఓటర్లు 1500 అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

రాష్ట్రంలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి 17 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వెస్ట్ చంపరన్, ఈస్ట్ చంపరన్, సీయోరన్, సీతమరి, మధుబన్, దర్భంగా, ముజఫర్‌పూర్, గోపాల్ గంజ్, సింహన్, శరన్, వైశాలి, సమస్తీపూర్, బెగుసరాయ్, కగరాయి, భగలల్పూర్, నలంద, పాట్నా జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

రెండో విడత ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో తేజస్వి యాదవ్, సతీష్ కుమార్, రబ్రీదేవి తదితరులు పోటీలో ఉన్నారు.
 

click me!