విద్యార్ధి రిక్వెస్ట్: బస్సు టైమింగ్ మార్పు

By narsimha lodeFirst Published Jan 14, 2021, 10:25 AM IST
Highlights

ఓ విద్యార్ధి అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకొన్న  రవాణాశాఖ  బస్సు టైమింగ్ మార్చింది. ఒడిశా రవాణా శాఖ ఓ విద్యార్ధి అభ్యర్ధనను మన్నించి బస్సు టైమింగ్ మార్చింది. 

భువనేశ్వర్: ఓ విద్యార్ధి అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకొన్న  రవాణాశాఖ  బస్సు టైమింగ్ మార్చింది. ఒడిశా రవాణా శాఖ ఓ విద్యార్ధి అభ్యర్ధనను మన్నించి బస్సు టైమింగ్ మార్చింది. 

భువనేశ్వర్‌లోని ఎంబీఎస్ పబ్లిక్ స్కూల్ లో ఏడోతరగతి చదువుతున్న సాయి అన్వేష్ అమృతం  ప్రధాన్ అనే విద్యార్ధి ప్రతి రోజూ రవాణా శాఖ బస్సులో స్కూల్ కు వెళ్తాడు.తన ఇంటి నుండి బస్సు ఉదయం 7:40 గంటలకు ప్రారంభం అవుతోంది. ఈ బస్సు టైమింగ్ కారణంగా ప్రతి రోజూ అన్వేష్ స్కూల్ కు ఆలస్యంగా వెళ్తున్నాడు. దీంతో టీచర్లతో చీవాట్లు తింటున్నాడు.

ఆలస్యంగా స్కూల్ కు వెళ్లడం వల్ల కొన్ని సమయాల్లో క్లాసులు కూడ ఆయన మిస్ అవుతున్నారు. బస్సు టైమింగ్ మార్చితే తన సమస్య తీరుతుందని ఆయన భావించాడు. తన సమస్యను రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భావించాడు. ట్విట్టర్ లో తన ఇబ్బందిని పేర్కొంటూ బస్సు టైమింగ్ ను మార్చాలని కోరుతూ అన్వేష్ క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారి అరుణ్ బొత్రాను ట్యాగ్ చేశారు.

ఈ విషయాన్ని పరిశీలించిన ఎండీ అరుణ్ బొత్రా సంబంధిత అధికారులతో చర్చించారు. బస్సు టైమింగ్స్ ను మార్చుతామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు బస్సు టైమింగ్ కూడ మారింది.దీంతో సాయి అన్వేష్ సమయానికి స్కూల్ కు వెళ్తున్నాడు. తనకు ఇబ్బంది కలగకుండా బస్సు టైమింగ్ ను మార్చిన  రవాణా శాఖ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

click me!