ఒడిశా రైలు ప్రమాదం : గాయపడిన వారికి రక్తదానం చేయడానికి క్యూ కట్టిన ప్రజలు...

By SumaBala BukkaFirst Published Jun 3, 2023, 10:01 AM IST
Highlights

కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ లో క్షతగాత్రులకు రక్తదానం చేయడానికి ప్రజలు క్యూ కట్టారు. 900మందికి పైగా ఈ ఘటనలో క్షతగాత్రులవ్వడంతో వీరితో సమీప ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. 

ఒడిశా : బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 237 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారికోసం రక్తదానం చేయడానికి ప్రజలు క్యూ కట్టారు.అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు 237 మంది మరణించారు. సుమారు 900 మంది గాయపడ్డారు. మరోవైపు రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాప దినంగా ప్రకటించింది.

"ఈ ప్రమాదం జరిగినప్పుడు నేను సమీపంలోనే ఉన్నాం, 200-300 మందిని రక్షించాం" అని స్థానికుడైన గణేష్ తెలిపాడు. గత రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, కోల్‌కతా నుంచి మరింత మంది ఆర్మీ సిబ్బంది రానున్నారని ఇండియన్ ఆర్మీ కల్నల్ ఎస్‌కే దత్తా తెలిపారు. "మేము గత రాత్రి నుండి నిరంతరం రెస్క్యూ ఆపరేషన్స్‌లో నిమగ్నమయ్యాం. కోల్‌కతా నుండి మరింత సైన్యం వస్తున్నాయి" అని కల్నల్ ఎస్‌కే దత్తా తెలిపారు.

కోరమండల్ ట్రైన్ లో 120మంది తెలుగు వారు.. 237కు చేరిన మృతుల సంఖ్య..

మొత్తం 200 అంబులెన్స్‌లు, 45 మొబైల్ హెల్త్ టీమ్‌లతో పాటు 108 ఫ్లీట్‌లలో 167, 20కి పైగా ప్రభుత్వ అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు ఎస్‌సిబికి చెందిన 25 మంది వైద్యుల బృందంతో పాటు 50 మంది అదనపు వైద్యులను కూడా సమాయత్తం చేశారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పీఆర్ఎమ్ ఎంసిహెచ్, బరిపడ, ఎస్ సిబి ఎంసిహెచ్ నుండి సమీకరించబడిన ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషలిస్టులు మృతదేహాల తొలగింపును పర్యవేక్షించడానికి నియమించబడ్డారు.

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ బ్లడ్ సేఫ్టీ, అదనపు డీఎంఈటీ, మరో ముగ్గురు అదనపు డైరెక్టర్లు బాలాసోర్‌లో ఉన్నారు. ఆరోగ్య బృందాలతో సమన్వయం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఆరు బృందాలు పని చేస్తున్నాయని ఎన్డీఆర్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ తెలిపారు.

ఇదిలా ఉండగా, ఒడిశా రైలు ప్రమాదం మీద రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంంద్ర మోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ శనివారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాద కారణాల మీద ఆరా తీశారు. ప్రమాదం మీద ఉన్నత స్తాయి విచారణకు ఆదేశించారు. విచారణ తరువాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ రెస్క్యూ ఆపరేషన్ ను పరిశీలించారు. 

ప్రమాదంలోని క్షతగాత్రులను రక్షించడానికి, మృతులను తరలించడానికి 250 అంబులెన్సులు.. 68 బస్సులు పనిచేస్తున్నాయి. రాత్రి వరకు ఈ సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇంకా భోగీల్లో మృతదేహాలు ఉన్నట్టుగా తెలిపారు. ఒడిశా ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో 120 మంది తెలుగు ప్రయాణికులు ఉన్నారు.  

ఒడిశా రైలు ప్రమాదంపై వివిధ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. షాలిమార్, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం,తిరుపతి,బాలాసోర్, సికింద్రాబాద్,విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం,బాపట్ల,తెనాలి,నెల్లూరు, ఒంగోలు,రేణిగుంటలకు హెల్స్ లైన్లు ఏర్పాటు చేశారు. 

click me!