ఒడిశాలో 15 రోజుల లాక్ డౌన్... ఎప్పటినుంచంటే..

By AN TeluguFirst Published May 2, 2021, 1:06 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తగా లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలను అమల్లోకి తీసుకువచ్చాయి. తాజాగా 
ఒడిశా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తగా లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలను అమల్లోకి తీసుకువచ్చాయి. తాజాగా 
ఒడిశా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.

మే 5 నుంచి 15 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 5 నుంచి మే 19 వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.

దేశవ్యాప్తంగా కరుణ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పూర్తి లాక్ డౌన్ ప్రకటించగా... కొన్ని రాష్ట్రాలు వారాంతాల్లో లాక్ డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ లాంటివి విధిస్తున్నాయి.

ఈ క్రమంలో ఒడిస్సా ప్రభుత్వం కూడా కొత్తగా లాక్ డౌన్ ప్రకటించింది. మే 5 నుంచి 15 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 5 నుంచి మే 19 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. 

ఈ లాక్ డౌన్ సమయంలో అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ప్రభుత్వం సూచించిన నియమాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. రూల్స్ బ్రేక్ చేసే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు.

ఇప్పటివరకు ఒడిశాలో 4.62 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 69,453 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2068 మంది కరోనా బారినపడి చనిపోయారు. 

మరోవైపు దేశంలో ఆక్సీజన్ కొరత వేధిస్తున్న సమయంలో ఒడిశా ముందుకు వచ్చింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు ఒడిశా నుంచి మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసి ప్రజల ప్రాణాలు నిలబెడుతోంది.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!