విడిపోయిన భార్యాభర్తలు: 9 ఏళ్ల కొడుకు విక్రయం

Published : Oct 13, 2020, 01:59 PM IST
విడిపోయిన భార్యాభర్తలు: 9 ఏళ్ల కొడుకు విక్రయం

సారాంశం

భార్యాభర్తలు విడిపోయేందుకు నిర్ణయించుకొన్న మీదట తమకు పుట్టిన 9 ఏళ్ల కొడుకును విక్రయించారు.ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది.  

భువనేశ్వర్: భార్యాభర్తలు విడిపోయేందుకు నిర్ణయించుకొన్న మీదట తమకు పుట్టిన 9 ఏళ్ల కొడుకును విక్రయించారు.ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లాలోని తెల్గబెచా గ్రామంలో ఈ ఘటన జరిగింది.  9 ఏళ్ల బాలుడిని కొనుగోలు చేసిన వ్యక్తి  ఆ బాలుడిని హింసించడంతో ఈ విషయం వెలుగు చూసింది.

కొనుగోలు చేసిన వ్యక్తి ఆ బాలుడిని పశువులను మేపేందుకు నియమించాడు. ఈ క్రమంలోనే ఆ బాలుడిపై చిత్రహింసలకు పాల్పడ్డాడు.భార్యాభర్తలు విడిపోయారు. అంతేకాదు వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకొన్నారు.

తనను కొనుగోలు చేసిన వ్యక్తి నుండి తప్పించుకొన్న బాలుడు సల్పపదర్ గ్రామానికి చెందిన అంగన్ వాడీ వర్కర్ చెప్పాడు. దీంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.

తనతో పనిచేయించుకొన్న వ్యక్తి కనీసం తనకు భోజనం కూడ పెట్టడం లేదని ఆయన ఆరోపించాడు.
బందీగా ఉన్న ఇంటి నుండి తప్పించుకొన్న బాలుడు తనకు ఆహారం ఇచ్చే గ్రామస్తుల సహాయం కోరాడు. ఆ తర్వాత అతను అంగన్ వాడీ వర్కర్ ను ఆశ్రయించాడు.

ఈ బాలుడిని విక్రయించారా లేదా అనే విషయాన్ని తాము నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నామని మాథిలి బీడీఓ ఆశిష్ భోయ్ చెప్పారు.ఈ బాలుడిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !