అటల్ టన్నెల్ పై వివాదం... సోనియాను అవమానించారంటూ కాంగ్రెస్ ఆందోళన

Arun Kumar P   | Asianet News
Published : Oct 13, 2020, 01:57 PM IST
అటల్ టన్నెల్ పై వివాదం... సోనియాను అవమానించారంటూ కాంగ్రెస్ ఆందోళన

సారాంశం

అటల్ టన్నెల్ శంకుస్థాపన కాంగ్రెస్ హయాంలో జరగ్గా నిర్మాణం పూర్తయి ఓపెనింగ్ జరిగింది బిజెపి హయాంలో. ఇదే విషయం ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. 

హిమాలయాల్లోని పిర్ పంజాల్ శ్రేణిలో సముద్రమట్టానికి 10 వేల మీటర్ల ఎత్తులో అల్ట్రా మోడరన్ స్పెసిఫికేషన్లతో  9.02 కి.మీ దూరం నిర్మించిన అటల్ టన్నెల్ హైవేపై నిర్మించివాటిల్లో ప్రపంచంలోనే అతిపెద్దది. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి హిమాచల్ ప్రదేశ్ లో నిర్మించిన అటల్ టన్నెల్ ను ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. అయితే ఈ టన్నెల్ శంకుస్థాపన కాంగ్రెస్ హయాంలో జరగ్గా నిర్మాణం పూర్తయి ఓపెనింగ్ జరిగింది బిజెపి హయాంలో. ఇదే విషయం ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. 

యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ టన్నెల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మంత్రి పళ్లంరాజు తదితరులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికి గుర్తుగా ఓ శిలాపలకాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఆ శిలాపలకం ఇప్పుడు కనిపించడం లేదు. అదే వివాదాస్పదంగా మారింది. 

read more  అటల్ టన్నెల్ ని జాతికంకితమిచ్చిన ప్రధాని మోడీ, ప్రత్యేకతలివే ....

ప్రారంభోత్సవ సమయంలోనే ఈ శిలాపలకాన్ని కావాలని తొలగించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షురాలిని అవమానపర్చడానికే ఈ పని చేశారని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కుల్దీప్ సింగ్ రాథోడ్ ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ కు ఓ లేఖ రాశారు.

''గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని తొలగించడం అప్రజాస్వామికం. వెంటనే దాన్ని అక్కడ  ఏర్పాటు చేయకుంటే రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది'' అని సీఎంను హెచ్చరించారు కుల్దీప్ సింగ్. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?