కోరాపుట్ లో ఎదురుకాల్పులు: ఐదుగురు మావోల హతం

By telugu teamFirst Published May 8, 2019, 5:12 PM IST
Highlights

ఒడిశాలోని కోరాపూట్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. 

భువనేశ్వర్: ఒడిశాలోని కోరాపూట్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గల గ్రామంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పూట్ చత్తీస్ గడ్ లోని దంతేవాడలో జరిగిన జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. 

దంతేవాడ సమీపంలోని సుక్మా సరిహద్దులో గల గోండెరాస్ అటవీ ప్రాంతంలో నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో అక్కడ 30 టెంట్ల కింద నక్సలైట్ కమాండర్ శ్యామ్, దేవ, వినోద్ లతో పాటు వారి క్యాడర్ ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!