బ్రేకింగ్: ఎన్ఎస్ఈ చైర్మన్ చావ్లా రాజీనామా

By pratap reddyFirst Published Jan 11, 2019, 10:28 PM IST
Highlights

ఎయిర్ సెల్ - మాక్సిస్ లంచం కేసులో ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం, ఇతర అధికారులతో పాటు చావ్లాపై సిబిఐ అభియోగాలు మోపింది. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. చావ్లా రాజీనామాపై ఎన్ఎస్ఈ అధికారిక ప్రకటన చేసింది. 

న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజీ చైర్మన్ అశోక్ చావ్లా శుక్రవారం రాజీనామా చేశారు. చట్టపరమైన పరిణామాల నేపథ్యంలో తక్షణమే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 

ఎయిర్ సెల్ - మాక్సిస్ లంచం కేసులో ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం, ఇతర అధికారులతో పాటు చావ్లాపై సిబిఐ అభియోగాలు మోపింది. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. చావ్లా రాజీనామాపై ఎన్ఎస్ఈ అధికారిక ప్రకటన చేసింది. 

కేసులో సిబిఐ గత జులైలో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తూ వచ్చింది. చిదంబరం ప్రాసిక్యూషన్ కు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. అదే విధమైన అనుమతి అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అవసరం ఉంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలని సిబిఐ కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఎస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్న చావ్లా ఇటీవల వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆ పదవికి రాజినామా చేశారు  

click me!