
PM Modi: 21 వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు దేశ అభివృద్ధికి చోదకశక్తిగా మారుతున్నాయని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.
50 సంవత్సరాల క్రితం ఈశాన్య ఫ్రాంటియర్ ఏజెన్సీ (NEFA)కి అరుణాచల్ ప్రదేశ్‌గా కొత్త గుర్తింపు వచ్చిందనీ, ఈ 50 ఏళ్లలో రాష్ట్రాభివృద్దిలో తీవ్రంగా కృషి చేశారనీ, శక్తి వంచన లేకుండా కష్టపడి చేశారని తెలిపారు. అరుణాచల్ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తూర్పు ఆసియాకు ప్రధాన ద్వారం అరుణాచల్‌ను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ఆంగ్లో అబోర్ యుద్ధంలోనై.. స్వాతంత్య్ర తర్వాత సరిహద్దులను కాపాడటంలోనైనా.. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు చూపిన శౌర్యం, పరాక్రమం నిరుపమానమని, ప్రతి భారతీయుడికి అదో అమూల్యమైన వారసత్వ సంపద అని ప్రధాని ప్రశంసించారు. అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.
21వ శతాబ్దంలో తూర్పు భారతదేశం, ముఖ్యంగా ఈశాన్య భారతదేశం దేశ వృద్ధికి చోదకశక్తి (ఇంజన్) గా మారుతుందని, తాను దృఢంగా విశ్వసిస్తున్నాననీ, ఈ స్ఫూర్తితో అరుణాచల్ ప్రదేశ్ మరింత వేగంగా అభివృద్ధి చెందాలని, గత 7 ఏళ్లలో అరుణాచల్ ప్రజల అపూర్వమైందని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకున్న తీరు దేశానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ప్రజల దేశభక్తి, సామాజిక సామరస్యం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకున్న తీరు, కలిసికట్టుగా ఉండి.. సంప్రదాయ పురోగతిని సాధించిన తీరు దేశానికి ప్రేరణ కలిగిస్తోందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజల పరాక్రమం ప్రతి భారతీయునికి అమూల్యమైన వారసత్వం అని ఆయన అన్నారు. తూర్పు ఆసియాకు అరుణాచల్‌ను ప్రధాన గేట్‌వేగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు.
జాతీయ భద్రత విషయంలో అరుణాచల్ పాత్రను చూసి ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామనీ, అరుణాచల్‌కు అద్భుతమైన ప్రకృతి సంపద ఉందనీ, ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారనీ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యాటక అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా.. భారతరత్న భూపేన్ హజారికా రాసిన 'అరుణాచల్ హమారా' పాటలోని కొన్ని పంక్తులను కూడా ప్రధాని మోదీ పఠించారు. అరుణాచల్ ప్రదేశ్ ఫిబ్రవరి 20, 1987న పూర్తి స్థాయిలో రాష్ట్రంగా అవతరించింది.