Hindi controversy: హిందీ మాట్లాడని వారు దేశాన్ని విడిచిపోయాలి.. యూపీ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Published : Apr 30, 2022, 04:03 AM ISTUpdated : Apr 30, 2022, 04:18 AM IST
Hindi controversy: హిందీ మాట్లాడని వారు దేశాన్ని విడిచిపోయాలి.. యూపీ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

సారాంశం

. Hindi controversy: ఉత్తరప్రదేశ్‌ మంత్రి సంజయ్‌ నిషాద్‌ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడరాని దేశం విడిచి వెళ్లి పోవాలని అన్నారు. హిందీని ప్రేమించని వారు విదేశీయులుగా లేదా విదేశీ శక్తులతో లింకులు ఉన్న వారిగా పరిగణించబడుతారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాలు మండిపడుతున్నాయి.

Hindi controversy:  ఉత్తరప్రదేశ్‌ మంత్రి సంజయ్‌ నిషాద్‌ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడరాని దేశం విడిచి వెళ్లి పోవాలని అన్నారు. హిందీని ఇష్ట‌ప‌డ‌ని వారు లేదా హిందీని ప్రేమించని వారు విదేశీయులుగా లేదా విదేశీ శక్తులతో లింకులు ఉన్న వారిగా పరిగణించబడుతారని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం దేశంలో జాతీయ భాష వివాదం కొన‌సాగుతున్న‌నేప‌థ్యంలో మీడియా అడిగిన ఓ  ప్రశ్నకు సంజయ్‌ నిషాద్ స‌మాధానమిస్తూ.. భారత్‌లో నివసించాలనుకునే వారు తప్పనిసరిగా హిందీని ప్రేమించాల్సిందేనని అన్నారు. ఇండియా అంటే హిందుస్థాన్‌ అని రాజ్యాంగం చెబుతున్నదని, అంటే హిందీ మాట్లాడేవారి ప్రాంతమని అర్థం అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  

భారతదేశంలో నివసించాలనుకునే వారు హిందీని ప్రేమించాలి. మీరు హిందీని ఇష్టపడకపోతే, మీరు విదేశీయుడిగా లేదా విదేశీ శక్తులతో ముడిపడి ఉన్నారని భావించబడుతుంది. మేము ప్రాంతీయ భాషలను గౌరవిస్తాము, కానీ ఈ దేశం ఒక్కటే, భారతదేశం 'హిందూస్థాన్' అని భారత రాజ్యాంగం చెబుతోంది, అంటే హిందీ మాట్లాడేవారికి స్థలం అని అన్నారు. హిందూస్థాన్ హిందీ మాట్లాడని వారికి చోటు లేద‌నీ, వారు ఈ దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  అన్నారాయన.


బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ,  కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య ట్విట్టర్ లో వార్ జ‌రుగుతోంది.  ఇటీవలి హిందీ భాషా వివాద చర్చపై మీడియా ప్రశ్నకు సమాధానంగా నిషాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. “నాకు అన్ని ప్రాంతీయ భాషలపై గౌరవం ఉన్నప్పటికీ, చట్టం ప్రకారం హిందీ జాతీయ భాష. చట్టాన్ని ఉల్లంఘించే ఎవరైనా కటకటాల వెనక్కి నెట్టాలి.

కొందరు వ్యక్తులు హిందీ మాట్లాడేందుకు నిరాకరించడం ద్వారా ఉద్రిక్త‌త వాతావరణం నెల‌కొంటుంద‌నీ, మంచి వాతావ‌ర‌ణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నిషాద్ ఆరోపించారు. ఇలాంటి అంశాలు దేశంలో ఉద్రిక్తత సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయ‌ని  ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్ చేసిన వ్యాఖ్య‌ల‌పై విపక్షాల నేత‌లు ఘాటుగా స్పందించారు.

 నిజానికి  రాజ్యాంగం ఏ భాషకూ 'జాతీయ భాష' హోదా ఇవ్వదు. ఎనిమిదవ షెడ్యూల్‌లో 22 అధికారిక భాషలు ఉన్నాయి. అధికారిక భాషల చట్టం 1963, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక ప్రయోజనాల కోసం ఆంగ్లం లేదా  హిందీని సూచిస్తుంది.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu