
మహిళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై దాడులు ఆగడం లేదు. నిరంతరం ఎక్కడో ఓ చోట వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులని కూడా చూడకుండా వారిపై లైంగిక దాడి చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కామవాంఛతో మగాళ్లు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన వారికి శిక్షలు కూడా తొందరగా పడటం లేదు. నేరస్తులను విచారణ పేరిట చాలా కాలం పాటు కోర్టులు చుట్టూ తిప్పుతిన్నారు. ఈ కారణంగా కూడా నేరస్తుల్లో భయం కలగడం లేదు. ఫలితంగా ఇంకా మహిళపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
గత ఎనిమిదేళ్లలో హర్యానా (Haryana) లో 65 శాతం రేప్ (Rape) కేసులు పెరిగాయి. ఇంతలా పెరగడం ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ రాష్ట్రంలోని ముఖ్య పట్టణం అయిన గురుగ్రామ్ (gurugram) 2021 సంవత్సరంలో 212 కేసులతో అగ్రస్థానంలో నిలిచింది. హర్యానాలో 2021 సంవత్సరంలో మొత్తం 1,546 అత్యాచార సంబంధిత కేసులు నమోదయ్యాయి. 2014లో ఈ సంఖ్య 944 కాగా.. 2014 నుంచి 2017 మధ్య కాలంలో నమోదైన రేప్ కేసుల సంఖ్య సమానంగా ఉంది. కానీ 2018 నుంచి 2021 మధ్య కాలంలో కేసులు భారీగా పెరిగాయి.
అయితే ఇక్కడ మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఈ అత్యాచార కేసుల్లో శిక్ష చాలా దారుణంగా ఉంది. 2014లో కేవలం 151 మంది నిందితులు మాత్రమే అత్యాచారానికి పాల్పడ్డారని డేటా సూచిస్తోంది. ఆ సంఖ్య 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2020 ప్రకారం వరుసగా 108, 91, 84, 48, 28, 3,1 గా ఉంది. కేసులు నమోదైన సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే శిక్ష పడుతోంది.
హర్యానా (haryana) అసెంబ్లీ బడ్జెట్ సెషన్ (assembly budget session) సందర్భంగా మెహమ్ (meham)కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే బాల్‌రాజ్ కుందు (balraj kundu) అడిగిన ప్రశ్నకు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ (haryana home minister anil vij) అత్యాచార గణాంకాలను వెల్లడించారు. దీంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2014 నుంచి 2021 మధ్య నమోదైన అత్యాచార సంబంధిత కేసుల సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే కుందు కోరారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గ్యాంగ్ రేప్ (gang rape) కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 2014లో 206 కేసులు నమోదు కాగా, 2021లో 177 కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు కేసులను మాత్రమే పోలీసులు నమోదు చేశారు. మిగిలిన కేసుల్లో బాధితుడు లేదా ఇతర వ్యక్తులు మాత్రమే ఎఫ్ఐఆర్ (FIR) దాఖలు చేశారని మంత్రి తెలిపారు. 2021లో గురుగ్రామ్ (gurugram)లో అత్యధికంగా 212 రేప్ కేసులు నమోదయ్యాయని హోం మంత్రి చెప్పారు. తర్వాత ఫరీదాబాద్ (faridhabad) 135 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. ఇక గ్యాంగ్ రేప్ కేసుల విషయానికొస్తే 2021లో మేవాత్‌లో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి, తర్వాత పాల్వాల్ 19 కేసులను నమోదు చేసింది.