
అమరావతి: అవిశ్వాస తీర్మాణంపై టీడీపీకి 13 నిమిషాల సమయాన్ని స్పీకర్ కేటాయించారు.సుమారు ఏడు గంటల పాటు అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉంది. లోక్‌సభలో పార్టీల బలాలకు అనుగుణంగా అవిశ్వాసంలో చర్చకు సమయాన్ని కేటాయిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకొన్నారు.
అవిశ్వాసంపై లోక్‌సభలో రేపు చర్చ జరగనుంది.ఈ చర్చ సందర్భంగా ఆయా పార్టీలకు లోక్‌సభలో ఉన్న బలం ఆధారంగా సమయాన్ని కేటాయించారు.అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన టీడీపీకి 13 నిమిషాల సమయం మాత్రమే దక్కింది. లోక్‌సభలో ఎక్కువ సభ్యులున్న బీజేపీకి అత్యధికంగా మూడు గంటల 33నిమిషాల సమయం కేటాయిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీకి 38 నిమిషాల సమయాన్ని కేటాయించారు.బీజేడీకి 15 నిమిషాలు, శివసేనకు 14 నిమిషాలు, టీఆర్ఎస్‌కు 9 నిమిషాల సమయాన్ని కేటాయించారు.
అన్నాడీఎంకెకు 29 నిమిషాలు, టీఎంసీకి 27 నిమిషాలు, సీపీఐకు 7 నిమిషాల సమయాన్ని కేటాయిస్తూ స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎల్జీఎస్పీకి 5 నిమిషాలను కేటాయించారు స్పీకర్. సీపీఐకి 7 నిమిషాల సమయాన్ని కేటాయించారు.