పార్లమెంట్‌లో చర్చల తీరుపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Aug 15, 2021, 12:28 PM IST
Highlights


 పార్లమెంట్ పై  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  ఎన్వీ రమణ ఆదివారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు.  పార్లమెంట్ ఉభయ సభల్లో సరైన చర్చలు జరగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో న్యాయవాదులు ఉభయసభల్లో ఎక్కువగా ఉండేవారన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.

న్యూఢిల్లీ:పార్లమెంట్‌ పనితీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలనవ్యాఖ్యలు చేశారు. చట్టాలు చేసే సమయంలో చర్చ జరగకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్  నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆదివారం నాడు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

కొత్త చట్టాలు చేసే  సమయంలో  పార్లమెంట్‌లో చర్చ జరగకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాల అమలు ఉద్దేశం ఏమిటో కూడా తెలియకుండా పోతోందన్నారు. గతంలో పార్లమెంట్ ఉభయసభల్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారన్నారు.  ప్రస్తుతం న్యాయవాదులు ప్రజా సేవకు కొంత సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు.

పార్లమెంట్‌లో చర్చ జరగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొత్త చట్టాల ఉద్దేశ్యం ఏమిటో తెలియడం లేదన్నారు. న్యాయవాదులు, మేధావులు చట్టసభలలో లేని సమయంలో  ఈ పరిస్థితి నెలకొందన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల్లో ఎక్కువ మంది న్యాయవాదులుగానే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తొలి లోక్‌సభ, రాజ్యసభలో కూడ ఎక్కువ మంది న్యాయవాదులేనని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో చర్చలు దురదృష్టకరమన్నారు. అప్పటి  సభల్లో చర్చలు నిర్మాణత్మకంగా సాగేవన్నారు. ఆర్ధిక బిల్లులపై చర్చలు నిర్మాణాత్మకంగా ఉండేవన్నారు.

మీరంతా న్యాయవాద వృత్తికే పరిమితం కావొద్దు, ప్రజా సేవకు కూడ  కొంత సమయాన్ని కేటాయించాలని ఆయన న్యాయవాదులను కోరారు.

 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పథకాలను సమీక్షించుకోవడానికి సమయం ఆసన్నమైందన్నారు., దేశ చరిత్రలో 75 ఏళ్ల సమయం చాలా చిన్న సమయం కాదన్నారు. తాము స్కూలుకు వెళ్లే సమయంలో చిన్న బెల్లం ముక్క, జెండాను ఇచ్చేవారన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడ తమకు సంతృప్తి లేదన్నారు.

click me!