ప్రార్ధనా మందిరాలకు వచ్చే భక్తులకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వనుంది. సోమవారం నుండి ప్రార్ధనా మందిరాల్లో భక్తులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: ప్రార్ధనా మందిరాలకు వచ్చే భక్తులకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వనుంది. సోమవారం నుండి ప్రార్ధనా మందిరాల్లో భక్తులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
ప్రార్ధనా మందిరాల్లోకి వచ్చేందుకు వెళ్లేందుకు భక్తులకు వేర్వేరు మార్గాలు ఉండాలని కేంద్రం సూచించింది. ఆలయంలోకి భక్తులు ప్రవేశించే మార్గంలో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. అంతేకాదు భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కూడ కేంద్రం కోరింది.
also read:గుడ్‌న్యూస్: జూన్ 11 నుండి భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం
ప్రార్ధనా మందిరాలకు వచ్చేవారిని విడతలవారీగా పంపాలని కోరింది. క్యూ లైన్లలో భక్తులకు భక్తులకు మధ్య 2 మీటర్ల దూరం పాటించాలని కేంద్రం సూచించింది.భక్తి గీతాలను ఆలపించవద్దని సూచించింది. భక్తిగీతాలు, పాటలు రికార్డు చేసిన వాటిని విన్పించాలని కోరింది. ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం చల్లొద్దని కూడ సూచించింది.
అన్న ప్రసాదం తయారు చేసే సమయంలోనూ, పంచే సమయంలో కూడ భౌతిక దూరాన్ని పాటించాలని కూడ కేంద్రం ఆదేశించింది. విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను కూడ తాకకుండా చూడాలని సూచించింది. మతపరమైన సమావేశాలు, జనాలు గుంపులుగా వేడుకల నిర్వహణపై కూడ కేంద్రం నిషేధం విధించింది.
లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి మూడో వారం నుండి ఆలయాల్లో భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. ఈ నెల 8వ తేదీ నుండి ప్రార్ధనా మందిరాల్లోకి భక్తులను అనుమతించే అవకాశం ఉంది.