కరోనా జేఎన్.1 వైరస్ కేసులు: అదనపు వ్యాక్సిన్ అవసరమా?


కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరిగి పోతున్న నేపథ్యంలో  వ్యాక్సిన్ అవసరమా అనే చర్చ సాగుతుంది. అయితే  ఈ విషయమై  నిపుణులు కీలక ప్రకటన చేశారు.
 



న్యూఢిల్లీ: కరోనా జేఎన్.1 వైరస్  కేసులు  దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  కేరళ రాష్ట్రంలో కరోనా జేఎన్. 1 కరోనా కేసు తొలుత వెలుగు చూసింది. 

కరోనా జేఎన్. 1 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  గాను  వ్యాక్సిన్ అవసరమా అనే చర్చ ప్రారంభమైంది.   జేఎన్. 1 కరోనా వైరస్ కు  అదనపు కరోనా వ్యాక్సిన్ అవసరం లేదని  ఐఎన్ఎస్ఏసీఓజీ చీఫ్ డాక్టర్ ఆరోరా చెప్పారు.  అరవై ఏళ్లు లేద అంతకంటే ఎక్కువ యస్సు ఉన్న వారంతా రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు  అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన  సూచించారు. క్యాన్సర్ రోగులు  ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా జేఎన్. 1 వైరస్  ఓమిక్రాస్ కు జాతికి చెందిన సబ్ వేరియంట్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు. 

Latest Videos

భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో జేఎన్.1 కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది.ఈ వైరస్ కారణంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 

కరోనా జేఎన్.1 సబ్ వేరియంట్  కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని  ఎయిమ్స్ వైద్యులు  సూచించారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ నీరజ్ నిశ్చల్ చెప్పారు. 

గత 24 గంటల్లో భారత్ లో  కరోనా కేసులు  అనేక రెట్లు పెరిగాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420గా నమోదైంది.

 


 
 

click me!