రైల్వే పట్టాలకు దగ్గరగా పడిపోయిన ఇద్దరు పిల్లలను కాపాడేందుకు తల్లి పెద్ద సాహసం చేసింది. వారిద్దరినీ తన ఛాతీ దగ్గరకు తీసుకొని, ఎలాంటి ప్రమాదమూ జరగనీయకుండా ఒదిగిపట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.. ఇది ఐదేళ్ల కింద రిలీజ్ అయిన కేజీఎఫ్ సినిమాలోని డైలాగ్. బిడ్డల కోసం తల్లి దేనికైనా తెగిస్తుంది.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదిరిస్తుంది.. ఎవరితోనైనా పోరాడుతుంది అనే అర్థాన్ని ఇచ్చే ఆ మాటలు అక్షర సత్యాలు. పిల్లల కోసం తల్లి ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది. అవసరమైతే తన ప్రాణాలను కూడా లెక్కచేయదు. కన్న బిడ్డలను రక్షించుకునేందుకు మృత్యువు పై నుంచి వెళ్తున్నా కూడా పట్టించుకోలేదు ఓ తల్లి. చివరికి అందరూ క్షేమంగా బయటపడ్డారు.
అసలేం జరిగిందంటే..
అది బీహార్ రాష్ట్రం దానాపూర్ రైల్వే డివిజన్‌లోని బార్హ్ రైల్వే స్టేషన్. ఢిల్లీకి వెళ్లేందుకు ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆ రైల్వే స్టేషన్ శనివారం కు వచ్చింది. కొంత సమయం తరువాత భాగల్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే విక్రమశిలా ఎక్స్‌ప్రెస్ ప్లాట్ ఫారమ్ పైకి చేరుకుంది. అయితే అందులో ఎక్కేందుకు ఒక్కసారిగా స్టేషన్ లో ఉన్న జనమంతా ఎగబడ్డారు. ఆ తల్లి కూడా తన ఇద్దరు చిన్నారులను తీసుకొని రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు పిల్లలు సహా ఆమె ప్లాట్ ఫారమ్ పై, రైలు పట్టాల మధ్య పడిపోయింది. అదే సమయంలో రైలు కదలడం ప్రారంభించింది. దీనిని తల్లి గమనించింది. పిల్లలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో వారిని దగ్గరకు లాక్కుంది. వారిపై పడుకొని రైలు తాకకుండా, పట్టాల మధ్యకు పిల్లలు వెళ్లకుండా ఒదిగిపట్టుకుంది. ఆమెపై కొన్ని అంగులాల దూరం నుంచే రైలు వేగంగా వెళ్లడం ప్రారంభించింది. పై నుంచి మృత్యువు వెళ్తున్నా.. కొంచెం కూడా కదలకుండా పెద్ద సాహసం చేసింది.
मौत के सामने जीती मां की ममता. के रेलवे स्टेशन से वीडियो. भीड़ में मां, दो बच्चों संग पटरी पर गिरी. ट्रेन चलने लगी. 3 जिंदगियों के सामने मौत खड़ी थी. और दूसरी तरफ मां. उधर ट्रेन की रफ्तार थी. तो इधर मां की ममता. 25 सेकेंड बाद मां जीती. मौत हारी. pic.twitter.com/bsDxbD0EFS
— Sunil Maurya (@smaurya_journo)దీనిని గమనించి అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు. రైలు వెళ్లిపోయిన తరువాత ముగ్గురు క్షేమంగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అక్కడున్న వారంతా పిల్లలను, మహిళను పైకి లేపారు. అనంతరం వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.