బీజేపీ స్క్రిప్ట్‌పైనే విచారణ.. లతా, సచిన్‌లను గౌరవిస్తాం: అనిల్ దేశ్‌ముఖ్

By Siva KodatiFirst Published Feb 16, 2021, 3:11 PM IST
Highlights

ప్రఖ్యాత సినీ నేపథ్య గాయనీ లతా మంగేష్కర్‌, క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌‌లు చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేయాలని తాను అనలేదన్నారు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రఖ్యాత సినీ నేపథ్య గాయనీ లతా మంగేష్కర్‌, క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌‌లు చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేయాలని తాను అనలేదన్నారు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రముఖుల ట్వీట్ల విషయంలో బీజేపీ ఐటీ సెల్‌ పాత్రను పరిశీలిస్తామని మాత్రమే అన్నట్లు అనిల్ పేర్కొన్నారు. లతా మంగేష్కర్‌, సచిన్‌లను తాము గౌరవిస్తామని తెలిపిన దేశ్‌ముఖ్ .. ఈ ఇద్దరు దిగ్గజాలకు వ్యతిరేకంగా విచారణ జరపబోమని స్పష్టం చేశారు.

పలువురి ట్వీట్లకు బీజేపీ స్క్రిప్టును అందించిందన్న అంశంపైనే తాము విచారణ చేపడతామని అనిల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై మహారాష్ట్ర నిఘా విభాగం దర్యాప్తు జరుపుతోందని వివరించారు. ప్రముఖుల ట్వీట్ల వెనకాల బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్ సహా 12 మంది హస్తం ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని అనిల్‌ దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు.  

కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్ధతుగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌, పాప్‌ సింగర్‌ రిహాన్నా ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ట్వీట్లపై పలువులు సెలబ్రెటీలు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అయితే ఈ ట్వీట్ల కోసం కొందరు ఆ ప్రముఖులపై ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపడుతోంది.

click me!