ఎన్డీఏ పక్షనేతగా నితీష్‌కుమార్ ఎన్నిక: రేపు బీహార్ సీఎంగా ప్రమాణం

By narsimha lodeFirst Published Nov 15, 2020, 1:42 PM IST
Highlights

: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  నితీష్ కుమార్ ఈ నెల 16వ తేదీన  ప్రమాణం చేయనున్నారు.
 

పాట్నా: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  నితీష్ కుమార్ ఈ నెల 16వ తేదీన  ప్రమాణం చేయనున్నారు.

ఇవే చివరి ఎన్నికలు: మాట మార్చిన నితీష్ కుమార్

ఈ సమావేశంలో బీజేపీ, జేడీ(యూ) ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీఏ పక్ష శాసనసభపక్షనేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు.బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈ నెల 16న ప్రమాణం చేయనున్నారు.ఆదివారం నాడు బీహార్ లోని ఎన్డీఏ పక్షాల సమావేశం జరిగింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో బీజేపీ, జేడీ(యూ), అవామీ మోర్చా, వికాస్ శీల్ హిన్సాస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీఏ పక్ష శాసనసభపక్షనేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు.

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈ నెల 16న ప్రమాణం చేయనున్నారు.ఎన్డీఏ కూటమిలో  ఎన్డీఏ కూటమిలోని బీజేపీకి 74, జేడీ(యూ)కి 43 స్థానాలు దక్కాయి.   అవామీ మోర్చా, వికాస్ శీల్ హిన్సాస్ నాలుగు చొప్పున అసెంబ్లీ సీట్లను గెలుచుకొన్నాయి.

ఎన్డీఏ పక్షాల సమావేశానికి ముందు జేడీ(యూ)  శాసనసభపక్ష సమావేశం జరిగింది. నితీష్ కుమార్ ను ఎమ్మెల్యేలు తమ పక్ష నేతగా ఎన్నుకొన్నారు. ఆ తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభపక్ష నేతగా నితిష్ కుమార్ పేరును కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి  నితీష్ కుమార్ రేపు ప్రమాణం చేయనున్నారు. 
 


 

click me!