వీర జవాన్ తల్లి పాదాలకు మొక్కిన నిర్మలా సీతారామన్

Published : Mar 05, 2019, 12:10 PM IST
వీర జవాన్  తల్లి పాదాలకు మొక్కిన నిర్మలా సీతారామన్

సారాంశం

 దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్‌  తల్లి కాళ్లను కేంద్ర రక్షణ శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్  మొక్కారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డెహ్రాడూన్: దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్‌  తల్లి కాళ్లను కేంద్ర రక్షణ శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్  మొక్కారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎల్ఓసీ వద్ద శత్రువుల తూటాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన అజిత్ ప్రధాన్ అనే జవాన్ మృతి చెందాడు.  అమర జవాన్ కుటుంబానికి నివాళులర్పించే  కార్యక్రమాన్ని సోమవారం నాడు ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో జరిగింది.

 

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజిత్ ప్రధాన్  తల్లి హేమ కుమారి పాల్గొన్నారు. ముస్సోరికి చెందిన  బీజేపీ ఎమ్మెల్యే గణేష్ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.ఈ సందర్భంగా  అమరజవాన్ల కుటుంబసభ్యులను కేంద్ర మంత్రి సన్మానించారు. 

ఈ సమయంలోనే  హేమకుమారి కాళ్లను కేంద్ర మంత్రి మొక్కారు. కేంద్రమంత్రి అమర జవాన్ తల్లి కాళ్లు మొక్కగానే సభికులు చప్పట్లు కొట్టి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

దేశ ఎగుమతుల్లో ఈ రాష్ట్రం టాప్... ఏడాదికి ఇన్నివేల కోట్లా..!
నేను కూడా భారతీయుడినే..European Council President Surprises PM Modi | PM Modi | Asianet News Telugu