విషాదకరమైన రోజు: నిర్మలా సీతారామన్ కు ఇంటిపోరు

By Sree s  |  First Published May 17, 2020, 8:14 AM IST

ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్( భారతీయ మజ్దూర్ సంఘ్) ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పై తీవ్రంగా మండి పడింది. దేశానికి ఇదొక దుర్ధినంగా అభివర్ణించింది. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇది అని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. 


ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీకి సంబంధించి రోజుకో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఆ ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుపుతున్న విషయం అందరికీ తెలిసిందే!

ఇందులో భాగంగా నిన్న నాలుగవరోజు కూడా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె ముఖ్యంగా ఆర్థికవృద్ధిని సాధించేందుకు విధానపరమైన సంస్కరణలు అవసరమని, నిన్న పూర్తిగా వాటిపైన్నే మాట్లాడారు.  

Latest Videos

అయితే... నిన్న సంస్కరణల్లో భాగంగా ఆమె అధికంగా ప్రైవేటీకరణపై దృష్టి సారించారు. విద్యుత్ బోర్డుల దగ్గరి నుండి ఎయిర్ పోర్టుల వరకు వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 

ఇలా ప్రైవేటీకరించడం పై ఆమెకు సొంతవారి నుండే సెగ మొదలయింది. ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్( భారతీయ మజ్దూర్ సంఘ్) ఇలా ప్రైవేటీకరించడంపైఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పై తీవ్రంగా మండి పడింది. దేశానికి ఇదొక దుర్ధినంగా అభివర్ణించింది. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇది అని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఆర్ధిక విధానరూపకర్తలకు సంస్కరణలంటే... ప్రైవేటీకరణ తప్ప వేరే ఏదీ గుర్తుకు రాదని, ఈ కరోనా కష్టకాలంలో ఆర్ధిక వృద్ధికి తోడ్పాటునిచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలే అని బిఎంఎస్ కార్యదర్శి విర్జేశ్ ఉపాధ్యాయ అన్నారు. 

ప్రైవేటీకరణ వల్ల తీవ్రంగా నష్టపోయేది ఉద్యోగులని, ఇలా చేయడం వల్ల భారీస్థాయిలో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు ఆయన. ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం సిగ్గుచేటని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించినట్టే అని అన్నారు. 

ఇకపోతే నిన్న నిర్మల సీతారామన్ తన ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా కేంద్రపాలితప్రాంతాల్లోని డిస్కంలను ప్రైవేటీకరిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా రక్షణ రంగంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని ఆటోమేటిక్ రూట్ ద్వారా అమాంతం పెంచేశారు. 

click me!