నా కూతురు పేగులు బయటకు లాగారు.. అప్పుడు ఏమయ్యాయి ఈ మానవ హక్కులు.. నిర్భయ తల్లి

By telugu teamFirst Published Dec 12, 2019, 11:34 AM IST
Highlights

2012 డిసెంబర్ లో ఢిల్లీలో  కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ప్రైవేటు పార్ట్స్ లో గాజు పెంకులు చొప్పించారు. నడి రోడ్డుపై వివస్త్రను చేసి పడేసి.. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నిర్భయ కేసు నిందితులకు ఉరి శిక్ష వేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏ రోజైన నిర్భయను అతి కిరాతకంగా హింసించి.. అత్యాచారానికి పాల్పడ్డారో.. అదే రోజు డిసెంబర్ 16వ తేదీన  నలుగురు నిందితులను ఉరి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే... నిందితుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై నిర్భయ తల్లి స్పందించారు.

Read also: ఆ మృతదేహం దిశదే: డిఎన్ఏ రిపోర్ట్ ఇదీ...

‘‘నా కూతురు పేగుల్ని బయటకు లాగినప్పుడు... వారికి మానవహక్కుల సంగతి గుర్తుందా?’ అని నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012 డిసెంబర్ లో ఢిల్లీలో  కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ప్రైవేటు పార్ట్స్ లో గాజు పెంకులు చొప్పించారు. నడి రోడ్డుపై వివస్త్రను చేసి పడేసి.. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా.. నిందితుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌.. క్షమాభిక్ష కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అందులో అతడు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లో అంశాల గురించి ప్రస్తావించడంపై నిర్భయ తల్లి మండిపడ్డారు. ‘‘వాళ్లకేమో (నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారకులైనవారికి) పూర్తిస్వేచ్ఛ ఉంటుంది.. మాకేమో మానవహక్కులంటూ తర్కం చెబుతారా? బాధితులకు మాత్రమే ఎందుకు అన్ని నిబంధనలూ చూపుతారు? వాళ్లని డిసెంబరు 16నే ఉరి తీయాలి’’ అని నిప్పులు చెరిగారు.

Read also దిశకు పేరేంట్స్‌తో సఖ్యత లేదు.. అందుకే చెల్లికి ఫోన్: కామారెడ్డి జడ్పీ‌ ఛైర్‌పర్సన్ వ్యాఖ్యలు

click me!