నిర్భయదోషులను ఉరితీయడానికి మరోసారి "ముహూర్తం" ఫిక్స్... కొత్త డెత్ వారెంట్ జారీ

By Siva KodatiFirst Published Feb 17, 2020, 4:16 PM IST
Highlights

నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష తేదీలు ఖరారయ్యాయి. నలుగురు దోషులకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఉరిశిక్షకు అమలకు సంబంధించి కొత్త డెత్ వారెంట్లు ఇచ్చింది. మార్చి 3న నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. 

నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష తేదీలు ఖరారయ్యాయి. నలుగురు దోషులకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఉరిశిక్షకు అమలకు సంబంధించి కొత్త డెత్ వారెంట్లు ఇచ్చింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. 

ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 1న నలుగురు దోషులను ఉరితీయాలి. అయితే ఈ నలుగురు మరణశిక్ష అమలు జాప్యం జరిగేలా ఒక్కొక్కరుగా తమకున్న న్యాయపరమైన అవకాశాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే ఈ జాప్యంపై నిర్భయ తల్లిదండ్రులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈసారైనా నలుగురిని ఉరితీయాలని వారు కోరారు. 

Also Read:నిర్భయ కేసు: కేంద్రానికి హైకోర్టు షాక్, దోషులకు వారం గడువు

నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ పిటిషన్‌ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు తిరస్కరించింది.సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును, మెడికల్ స్టేటస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రపతి కోవింద్ తన మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించారని నిర్భయ దోషి వినయ్ శర్మ  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

నియమ నిబంధనల ప్రకారంగానే వినయ్ శర్మ మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించినట్టుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.దీంతో వినయ్ శర్మ  తన మెర్సీ పిటిషన్‌ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను  రద్దు చేసింది. 

Also Read:నిర్భయ దోషుల ఉరిపై స్టే ఎత్తివేత పిటిషన్: తీర్పు రిజర్వ్

సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును, మెడికల్ స్టేటస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించారని నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ కోర్టుకు చెప్పుకున్నాడు. వినయ్ శర్మ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో వాదిస్తూ గురువారం వాదించారు.

వినయ్ ను శారీరకంగా హింసించిన చరిత్ర ఉందని, చాలా సార్లు వినయ్ ను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకుని వెళ్లారని, పిటిషనర్ మెంటల్ కండీషన్ బాగా లేదని, అంతులేని వేదనను అనుభవించాడని ఆయన అన్నారు.
 

click me!