
Niranjan Reddy: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు నాయకులు ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించినట్లు మాట్లాడుతున్నారని, ఆ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని సంచలన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు తన ఇంట్లో వైఎస్సార్ ఫొటో పెట్టించారని విమర్శించారు. ఆయన పార్టీలో చేరిన తరువాత నియోజకవర్గంలో ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టించలేదని, కానీ, నేడు వాళ్లకు ఆకస్మాత్తుగా తెలంగాణపై ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు.
పొంగులేటీ, జూపల్లి లు తెలంగాణ ద్రోహులనీ, వారు తెలంగాణ గురించి మాట్లాడేమేంటని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 'పార్టీ అధినేతను పొంగులేటి, జూపల్లి విమర్శించారు. పార్టీకి అతీతులమనే వ్యక్తిగత ధోరణి ఎవరూ సహించరు. ఇద్దరు నాయకుల ప్రవర్తనను పార్టీ సహనంగా పరిశీలించింది. చాలాకాలం నుంచి పార్టీ సంయమనంతో వ్యవహరించింది. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎవరైనా పార్టీ వదలకూడదనే పార్టీ చూస్తుంది. పదవులు అనుభవించిన తర్వాత విమర్శలు చేయడం తగదు. ఇద్దరు నాయకులు అసహనం వెల్లగక్కుతూ నిందలు మోపారు' అని నిరంజన్ రెడ్డి చెప్పారు
జూపల్లి , పొంగులేటి పార్టీ క్రమశిక్షణ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వారు సందర్భం లేకున్నా సంధర్భం సృష్టించుకొని ప్రవర్తించారని , తమను ఏం చేయలేరనుకొని ఇష్టారీతిలో వ్యవహరించారని మండిపడ్డారు. పార్టీ అధినేతను పొంగులేటి, జూపల్లి విమర్శించారు. వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదనీ, ఓకరిద్దరి కోసం పార్టీ ని పనంగా పెట్టమని అన్నారు. కేసీఆర్ ను తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీ లో చేర్చుకున్న సందర్బాలున్నాయని అన్నారు.
టిఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీ లో చేరారనీ, జూపల్లి కి పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చిందనీ, పార్టీ లో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లి కి మంత్రి గా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఓడినా ఓపికతో వేచి చూడాలని పార్టీ చెప్పింది.. కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడారనీ, జూపల్లి కి సొంత ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు మాట్లాడి అంశాలే జూపల్లి, పొంగులేటి మాట్లాడుతున్నారనీ, అభివృద్ధి జరగకుంటే ఇన్ని రోజులు పార్టీ లో ఎందుకు ఉన్నారని నిలాదీశారు.
ఉద్యమంలో జూపల్లి పాత్రేంటీ ?
తెలంగాణ ఏర్పడిన తర్వాత పొంగులేటి టిఆర్ఎస్ లో చేరారనీ, తెలంగాణ ఉధ్యమం లో పొంగులేటి పాత్ర లేదని అన్నారు. పొంగులేటి పార్టీ లో ఏం చేసారో..ఎందుకు అవకాశం రాలేదే ఖమ్మం ప్రజలకు తెలుసునని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లు బీఆర్ఎస్ లో చేరినప్పుడే జూపల్లి రాజీనామా చేయాల్సిందనీ, అసలు పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుంటే.. అదిష్టానం దృష్టి కి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ని కాదని రెబల్స్ ను పోటీలో దించారని ఆరోపించారు. "గత తొమ్మిది ఏళ్ళు గా ఆత్మాభిమానం ఎటుపోయింది ...ఇన్ని రోజులు సంక నాకాడా.." అంటూ జూపల్లిపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూపల్లి జగన్ కోసం రాజీనామా చేసాడనీ, తెలంగాణ కోసం చేయలేదని విమర్శించారు.