పాన్ షాప్ ముందటి బల్బ్ దొంగిలించిన నైట్ డ్యూటీలోని పోలీసు.. వీడియో వైరల్..పోలీసుపై యాక్షన్

By Mahesh KFirst Published Oct 15, 2022, 6:00 PM IST
Highlights

నైట్ డ్యూటీ చేస్తున్న ఓ పోలీసు అధికారి పాన్ షాప్ ముందటి బల్బ్ దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. వీడియో వైరల్ కావడంలో పై అధికారి ఆ వీడియోలోని పోలీసుపై యాక్షన్ తీసుకున్నారు.
 

న్యూఢిల్లీ: నైట్ డ్యూటీ చేస్తున్న ఓ పోలీసు అధికారి వీధులు తిరుగుతూ దొంగలను పట్టుకోవాల్సిన పని వదిలి స్వయంగా దొంగతనం చేశాడు. రాత్రిపూట ఓ పాన్ షాప్ ముందుకు అటూ ఇటూ చూస్తూ వచ్చి.. మెల్లగా ఎదురుగా ఉన్న లైట్ బల్బ్‌ను తీసి జేబులో పెట్టుకుని జారుకున్నాడు. ఉదయం వచ్చిన పాన్ షాప్ ఓనర్‌కు ఆ లైట్ బల్బ్ కనిపించలేదు. సీసీటీవీ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆ దొంగా పోలీసు కథ బట్టబయలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గతవారం అంటే అక్టోబర్ 6వ తేదీన చోటుచేసుకుంది.

ప్రయాగ్ రాజ్ ఫూల్పూర్ ఏరియాలో నైట్ డ్యూటీలో వచ్చిన ఇన్‌స్పెక్టర్ రాజేశ్ వర్మనే ఈ  పని చేసినట్టు అధికారులు గుర్తించారు. ఆ అధికారిపై యాక్షన్ తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ రాజేశ్ వర్మ ఫూల్పూర్ కొత్వాలీ స్టేషన్‌లో పోస్ట్ అయ్యారు. ఈ చోరీ వీడియో వైరల్ అయిన తర్వాత ఎస్ఎస్‌పీ ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే, పోలీస్ లైన్‌కు అసైన్ చేశారు. రాజేశ్ శర్మ ఇటీవలే ప్రమోషన్ పొందారు. ఎనిమిది నెలల క్రితమే ఫూల్పూర్ పోలీసు స్టేషన్‌లో అసైన్ చేశారు. 

Uttar Pradesh: Policeman steals LED bulb, caught on CCTV camera pic.twitter.com/WEtp86Lbt2

— Harish Deshmukh (@DeshmukhHarish9)

ఇదిలా ఉండగా, సస్పెండ్ అయిన పోలీసు ఇన్‌స్పెక్టర్ రాజేశ్ వర్మ తన చర్యను సమర్థించుకున్నారు. తాను ఆ బల్బ్ తొలగించి తాను విధులు నిర్వహిస్తున్న చోట చీకటిగా ఉన్నదని అక్కడ పెట్టినట్టు వివరించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయి.

click me!