పెళ్లైన నెలకే.. కానిస్టేబుల్ మృతి

Published : Jun 13, 2019, 08:02 AM IST
పెళ్లైన నెలకే.. కానిస్టేబుల్ మృతి

సారాంశం

ఆ ఇంటి గుమ్మానికి కట్టిన తోరణాలు ఎండిపోలేదు. వధువు కాలికా రాసిన పారాణి ఆరనేలేదు. అంతలోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం నెల రోజులకే వరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 

ఆ ఇంటి గుమ్మానికి కట్టిన తోరణాలు ఎండిపోలేదు. వధువు కాలికా రాసిన పారాణి ఆరనేలేదు. అంతలోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం నెల రోజులకే వరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ధారూర్ మండలానికి చెందిన తులసీరామ్ (29) అనే యువకుడికి గతేడాది కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. కాగా..  తులసీరామ్‌కు మే 8వ తేదీ, 2019లో పూడూరు మండలం బొంగుపల్లితండాకు చెందిన మౌనికతో వివాహమైంది. అయితే పీఎస్‌ పరిధిలో జరిగిన ఓ కేసు విషయమై నిందితుడిని పట్టుకోవడానికి బీహార్‌కు అధికారులు, సిబ్బందితో తులసీరామ్‌ వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరామ్‌ దుర్మరణం పాలయ్యాడు. 

పెళ్లి జరిగి నెల రోజులు కూడా గడవకముందే ఇలా జరగడంతో.. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదం వార్త తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అతని భార్య కంటికో ధారలా విలపించింది. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?