గంగానదిలో చెక్కపెట్టెలో చిన్నారి: కాపాడిన స్థానికులు

Published : Jun 16, 2021, 03:54 PM IST
గంగానదిలో చెక్కపెట్టెలో చిన్నారి:  కాపాడిన స్థానికులు

సారాంశం

 యూపీలోని ఘాజీపూర్‌ వద్ద చెక్కపెట్టెలో పసిపాపను పెట్టి గంగానదిలో వదిలారు గుర్తు తెలియని వ్యక్తులు. చెక్కపెట్టె నుండి పాప అరుపులు విన్న స్థానికుడు ఆ బాలికను కాపాడారు. 

ఘాజీపూర్:. యూపీలోని ఘాజీపూర్‌ వద్ద చెక్కపెట్టెలో పసిపాపను పెట్టి గంగానదిలో వదిలారు గుర్తు తెలియని వ్యక్తులు. చెక్కపెట్టె నుండి పాప అరుపులు విన్న స్థానికుడు ఆ బాలికను కాపాడారు. ఈ చెక్కపెట్టె నిండా దేవుడు, దేవతల ఫోటోల మధ్య  పసిపాపను పెట్టి గంగానదిలో వదిలేశారు. ఘాజీపూర్ లోని దాద్రిఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు. పసిపాప పేరు గంగా అని  చెక్కపెట్టెలో రాసి పెట్టారు. ఈ బాలికను కాపాడిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  బాలికను ఆశాజ్యోతి కేంద్రానికి తరలించారు పోలీసులు.  బాలిక వయస్సు 21 రోజుల వయస్సు ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

దాద్రీఘాట్‌ వద్ద చెక్క పెట్టె నుండి చిన్నారి అరుపులు విన్న ఓ వ్యక్తి చెక్క పెట్టెను తెరిచి చూశాడని పోలీసులు తెలిపారు. చిన్నారిని చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేశారని తెలుసుకొన్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని చిన్నారిని చూశారు.  అధికారులు అనుమతిస్తే ఆ చిన్నారిని తాను పెంచుకొంటానని చిన్నారిని కాపాడిన వ్యక్తి చెప్పాడు.ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu