అసలు కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎందుకు కట్టారు .. కేంద్రంపై నితీష్ కుమార్ విమర్శలు

Siva Kodati |  
Published : May 27, 2023, 02:30 PM IST
అసలు కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎందుకు కట్టారు .. కేంద్రంపై నితీష్ కుమార్ విమర్శలు

సారాంశం

అసలు కొత్త పార్లమెంట్ భవనం ఎందుకని ప్రశ్నించారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. పాత పార్లమెంట్ భవంతి చారిత్రాత్మకమైనది.. కానీ ప్రస్తుతం అధికారంలో వున్న వ్యక్తులు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఫైరయ్యారు. 

భారత కొత్త పార్లమెంట్‌ను మరికొద్దిగంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సహా 19 విపక్ష పార్టీలు దూరంగా వున్నాయి. ఇదే సమయంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ బాడీ సమావేశానికి కూడా 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో బీజేపీ నేతలు విపక్షాలపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. పాత పార్లమెంట్ భవంతి చారిత్రాత్మకమైనది.. కానీ ప్రస్తుతం అధికారంలో వున్న వ్యక్తులు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా వుండాలన్న విపక్ష పార్టీల చర్యలను పెద్ద సంఖ్యలో బ్యూరోక్రాట్లు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు ఖండించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనపై సంతకం చేసిన వారిలో 88 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, 100 మంది అనుభవజ్ఞులు, 82 మంది విద్యావేత్తలు ఉన్నారు.

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించినందుకు ప్రతిపక్షాల చర్యలను తప్పుబట్టారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అన్నింటిని బహిష్కరించడానికి ఫ్యామిలీ ఫస్ట్ పార్టీలు కలిసి వచ్చాయని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం భారతీయులందరికీ ఇది గర్వించదగిన సందర్భం అయినప్పటికీ.. అపరిపక్వమైన, విచిత్రమైన, బూటకపు హేతువాదంతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.  

ALso Read: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం.. ప్రతిపక్షాల బాయ్‌కాట్ చర్యను ఖండించిన మాజీ బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు..

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన భారతదేశ ప్రధానమంత్రి.. తన ప్రామాణికత, సమ్మిళిత విధానాలు, వ్యూహాత్మక దృక్పథం, బట్వాడా చేయాలనే నిబద్ధతతో కోట్లాది మంది భారతీయులను ప్రేరేపించారు. అన్నింటికంటే ఆయన భారతీయత ‘‘కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు అసహ్యకరమైనది’’ అని వారు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ‘‘ఫ్యామిలీ ఫస్ట్ బ్రాండ్ రాజకీయాలను’’ ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ‘‘ఇండియా ఫస్ట్’’ కోసం నిలబడాలని వారు సూచించారు. 

ప్రభుత్వంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు ఉపయోగించిన నినాదానికి కౌంటర్‌గా..  ‘‘ప్రజాస్వామ్యం ఆత్మను పీల్చేది’’ ప్రతిపక్ష పార్టీలే అని వారు ప్రకటన ఆరోపించారు. పార్లమెంట్‌లో ఇటీవల జరిగిన పార్టీలకతీతమైన కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఎన్నిసార్లు బహిష్కరించాయి అనేది మనసును కదిలించేదిగా ఉందని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం