న్యూడిల్లీ : భారత ప్రజాస్వామ్యంలో దేవాలయంలాంటి పార్లమెంట్ ను మోదీ సర్కార్ అత్యాధునిక హంగులతో నూతనంగా నిర్మించింది. రాజసం ఉట్టిపడేలా అద్భుతమైన అందాలు, సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

01:15 PM (IST) May 28
బానిస ఆలోచనలను వదిలి భారత్ ప్రాచీన కాలంలోని గౌరవం వైపు నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నూతన భవనం అందుకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఈ భవనం చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నారని అన్నారు. లోక్ సభ రాష్ట్రీయ పక్షి నెమలిని పోలీవుంది. రాజ్యసభ కమలం మాదిరిగా వుందని ప్రధాని తెలిపారు.
01:04 PM (IST) May 28
సెంగోల్ గొప్పతనాన్ని వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. లోక్ సభలో సెంగోల్ ప్రతిష్టించడం గొప్ప విషయం... ఇది మన అదృష్టమని అన్నారు. సెంగోల్ ప్రతిష్టను తెలియజేయాలని అనుకున్నాం.
01:02 PM (IST) May 28
ఈ రోజు ప్రపంచం మొత్తం భారత సంకల్పంపై నమ్మకంగా చూస్తున్నారు. భారత్ ముందుకు వెళితేనే ప్రపంచమూ ముందుకు వెళుతుందని ప్రధాని మోదీ అన్నారు.
12:59 PM (IST) May 28
ఇది కేవలం పార్లమెంట్ భవనం కాదు దేశ ప్రజలు ఆకాంక్షలు, కలల ప్రతిబింబం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
12:41 PM (IST) May 28
నూతర పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు అధికారులు. అంతకుముందు నూతన పార్లమెంట్ నిర్మాణం, సెంగోల్ చరిత్రను తెలిపే వీడియోను ప్రదర్శించారు.
12:15 PM (IST) May 28
నూతన పార్లమెంట్ భవనం వైపు దూసుకెళుతున్న రెజ్లర్లను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పార్లమెంట్ మార్చ్ పేరిట రెజ్లర్లు ఆందోళనకు పిలుపునివ్వగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికి పార్లమెంట్ వైపు వెళుతున్న రెజ్లర్లను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
12:06 PM (IST) May 28
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అతిథులంతా ఇప్పటికే పార్లమెంట్ కు చేరుకున్నారు.
08:48 AM (IST) May 28
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పూజలు ముగిసాయి. ఉదయమే పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని ప్రస్తుతం తిరిగి వెళ్లిపోయారు. మళ్లీ 11.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నారు.
11.30 AM: అతిథులు, ప్రముఖుల రాక.
12.00 PM: ప్రధాని నరేంద్ర మోదీ రాక. జాతీయ గీతాలాపనతో వేడుక ప్రారంభమవుతుంది.
12.10 PM: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ , రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ ప్రసంగం.
12.17 PM: రెండు లఘు చిత్రాల ప్రదర్శన.
12.38 PM: రాజ్యసభలో ప్రతిపక్ష నేత ప్రసంగం (హాజరయ్యే అవకాశం లేదు). లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం.
1.05 PM: రూ. 75 నాణెం , స్మారక స్టాంపును ప్రధానమంత్రి విడుదల చేస్తారు.
1.10 PM: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.
2.00 PM: వేడుక ముగుస్తుంది.
08:24 AM (IST) May 28
ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనంలోని లోక్ సభ స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్ ను ప్రతిష్టించారు. అనంతరం స్పీకర్ ఓంబిర్లాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసారు.
08:09 AM (IST) May 28
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. అన్ని మతాలకు చెందిన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
07:37 AM (IST) May 28
నూతన పార్లమెంట్ భవన ప్రాంగణంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ పాల్గొన్నారు.
07:32 AM (IST) May 28
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా జరిగే పూజా కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు.
07:15 AM (IST) May 28
భారత నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్దమయ్యింది. మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. నూతన పార్లమెంట్ భవన మండపాల్లో పూజలు నిర్వహించనున్నారు.