
Former Congress president Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. సాధారణ పరీక్షల కోసమే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు వార్తాసంస్థ పీటీఐ నివేదించింది.
Former Congress president Sonia Gandhi admitted to Ganga Ram Hospital in Delhi for routine check-up: Sources
వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం రొటీన్ చెకప్ కోసం ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఆమెతో పాటు ఆసుపత్రికి వెళ్లినట్లు వారు తెలిపారు. కాగా, సోనియా గాంధీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. సోనియా గాంధీ మంగళవారం నుంచి అస్వస్థతతో ఉన్నారనీ, అందుకే రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్రలో ఏడు కిలోమీటర్లు నడిచి ఢిల్లీకి తిరిగివచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సోనియా గాంధీ చివరిసారిగా డిసెంబర్ 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బహిరంగంగా కనిపించారు. అలాగే, డిసెంబర్ 24న దేశ రాజధానిలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో కూడా ఆమె పాల్గొన్నారు. జూన్ 2022లో, మాజీ కాంగ్రెస్ అధ్యక్షులైన సోనియా గాంధీ కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా సోనియా గాంధీని గంగారామ్ ఆసుపత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలియజేశారు. తాజాగా సోనియా గాంధీ రెగ్యులర్ చెకప్ కోసం ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని మావికలన్‌లో రాత్రికి ఆగిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర బుధవారం ఉదయం 6 గంటలకు తన యాత్రను తిరిగి ప్రారంభించింది. అయితే యాత్ర పునఃప్రారంభంలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో కలిసి రాలేదు. మధ్యాహ్నం తర్వాత ఆమె చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా యాత్ర పునఃప్రారంభానికి ముందే ఢిల్లీ నుంచి మావికలన్‌కు చేరుకున్నారని పార్టీ ఉత్తరప్రదేశ్ యూనిట్ అధికార ప్రతినిధి అన్షు అవస్థి తెలిపారు. అయితే యాత్ర పునఃప్రారంభంలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో కలిసి రాలేదు. మధ్యాహ్నం తర్వాత ఆమె చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.