ఆర్టీపీసీఆర్‌లో నెగిటివ్ వస్తేనే యూపీలోకి అనుమతి: యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం

By Siva KodatiFirst Published Jul 18, 2021, 7:54 PM IST
Highlights

అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆర్టీపీసీఆర్ రిపోర్టుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరోనా కట్టడి కోసం టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కూడా అధికారులను సీఎం ఆదిత్యనాథ్ ఆదేశించారు
 

కరోనా కట్టడి కోసం ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి రావాలనుకునే వారు తమకు కరోనా లేదని చెప్పే ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలంటూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. యూపీకి వచ్చిన రోజుకు నాలుగు రోజుల ముందు జారీ అయిన రిపోర్టులు ఉన్న వ్యక్తులను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

ALso Read:ఆగస్టులోనే థర్డ్ వేవ్.. ఐసీఎంఆర్ హెచ్చరిక..!

రోడ్డు, రైలు, విమానాల్లో యూపీకి వచ్చే వారందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే..ఈ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రెండు డోసులు తీసుకున్న వారి విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది. ఆదివారం అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆర్టీపీసీఆర్ రిపోర్టుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరోనా కట్టడి కోసం టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కూడా అధికారులను సీఎం ఆదిత్యనాథ్ ఆదేశించారు.

click me!